Begin typing your search above and press return to search.

‘రాలిపోయే పూవా నీకు రాగాలెందుకే’ ట్రంప్​కు సెట్​ అయ్యే పాట ఇదేనేమో..!

By:  Tupaki Desk   |   13 Jan 2021 11:48 AM GMT
‘రాలిపోయే పూవా నీకు రాగాలెందుకే’ ట్రంప్​కు సెట్​ అయ్యే పాట ఇదేనేమో..!
X
ఒకప్పుడు ఆయన కింగ్​. యావత్​ ప్రపంచాన్నే శాసించాడు. ఆయన చెప్పిందే వేదం.. చేసిందే శాసనం. అమెరికా ఫస్ట్​ అనే నినాదంతో అనూహ్యంగా బరిలోకి దిగిన డొనాల్డ్​ ట్రంప్ ను అమెరికన్లు అక్కున చేర్చుకున్నారు. అతడిని అందలం ఎక్కించారు. ట్రంప్​ కూడా ఉర్రూతలూగించే ప్రసంగాలతో జనాలకు మాంచి కిక్​ ఇచ్చేవాడు. కానీ రోజులు మారాయి. అతడి పాలనపట్ల ప్రజలకు విరక్తి వచ్చింది. కరోనా సమయంలో అతడి ప్రవర్తన మరీ విసుగెత్తించింది. ఫలితం అమెరికా ప్రజలు ట్రంప్​ను ఓడించారు.

ఆ స్థానంలో జో బైడెన్​ అనే మరో నేతను ఎన్నుకున్నారు. అయితే ఓటమిని అంగీకరించి.. హుందాగా అధికార మార్పిడికి సహకరించవలసిన ట్రంప్​ ఎదురుదాడికి దిగారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. డెమోక్రాట్లు అక్రమాలు చేసి గెలుపొందారని వాదించారు. అతడి వాదలను అక్కడి ఎన్నికలసంఘం, కోర్టులు తోసిపుచ్చాయి. అయినా ట్రంప్​ మొండిగా మందుకువెళ్లాడు. ప్రజలను, తన మద్దతుదారులను రెచ్చగొట్టాడు. ఫలితంగా ఆయన అనుచరులు వాషింగ్టన్​లోని అమెరికా పార్లమెంట్ భవనంపై దాడి చేశారు. ఈ దాడిని ట్రంప్​ సమర్థించారు కూడా. దీంతో సొంతపార్టీలోనే ఆయనపై విమర్శలు వచ్చాయి.

సామాజిక మాధ్యమాలు సైతం ఆయన అకౌంట్లు తొలగించాయి. ట్విట్టర్​, ఫేస్ బుక్​ లాంటి సంస్థలు ఆయన అకౌంట్లను తొలగించాయి. యూట్యూబ్​ కూడా ఆయన అకౌంట్లపై ఆంక్షలు విధించింది. అయితే తాజాగా టిక్​టాక్​ సంస్థ కూడా ట్రంప్​కు సంబంధించిన వీడియోలన్నీ తీసేసింది. టిక్​టాక్​పై గతంలో ట్రంప్​ కొరడా ఝలిపించిన విషయం తెలిసిందే. అయితే ఆ కోపంతో ఉన్న టిక్​టాక్​ . అవకాశం వచ్చినప్పుడు పగ తీర్చుకున్నదని విశ్లేషణలు వస్తున్నాయి. మరోవైపు యూట్యూబ్ సంస్థ కూడా ట్రంప్​ మాట్లాడిన పలు వీడియోలను తొలగించింది. మొత్తానికి ఒకప్పుడు ప్రపంచాన్నే శాసించిన ట్రంప్​ పరిస్థితి ప్రస్తుతం ఇలా మారిందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు విశ్లేషకులు.