Begin typing your search above and press return to search.

ట్రంప్ అస‌లు టార్గెట్ వీసాలు కాదు గ్రీన్‌ కార్డులు

By:  Tupaki Desk   |   22 April 2020 12:30 PM GMT
ట్రంప్ అస‌లు టార్గెట్ వీసాలు కాదు గ్రీన్‌ కార్డులు
X
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ కరోనా సంక్షోభం నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలం పాటు తమ దేశానికి ఎవరూ వలస రాకుండా నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంటూ తమ దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్‌ వెల్లడించారు. అమెరికాకు వలసలను (ఇమ్మిగ్రేషన్‌)ను తాత్కాలి కంగా నిలిపివేయడంతో ఆ ప్రభావం భారత విద్యార్థులు - సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్లపై పడే అవకాశం ఉంది. ట్రంప్ నిబంధ‌న‌ల వెనుక అస‌లు ఉద్దేశం గ్రీన్‌కార్డుల‌కు కోత పెట్ట‌డ‌మేన‌ని తెలుస్తోంది.

అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తాననే హామీతోనే ట్రంప్‌ గద్దెనెక్కారు. అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచి వలసలను కట్టుదిట్టం చేశారు. ప్రతిభ ఆధారిత వీసా చట్టాన్ని తీసుకొచ్చారు. దేశాలకు కోటా విధించారు. చైనా - ఐరోపా - కెనడా, -మెక్సికో వంటి దేశాల నుంచి వచ్చే వలసలపై నియంత్రణ విధించారు. మెక్సికో సరిహద్దులో ఏకంగా గోడ కడుతున్నారు. త్వ‌ర‌లోనే ఎన్నిక‌లున్న త‌రుణంలో మ‌రోమారు ట్రంప్ వ‌ల‌స‌ల ఎజెండాను తెర‌మీద‌కు తెచ్చార‌ని అంటున్నారు. అమెరికాలో శాశ్వ‌త నివాస హోదాకోసం సాధార‌ణంగా వ‌ల‌స ప్ర‌జ‌లు అమెరికా ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకుంటే దాన్ని ఆమోదిస్తూ ఇచ్చే అనుమ‌తిని దాన్నే గ్రీన్‌ కార్డు అంటారు. ప్రపంచంలోనే అత్యంత వృత్తి నిపుణులుగా ఖ్యాతిపొందుతున్న భారతీయులు ప్రధానంగా హెచ్-1బీ వర్క్ వీసాలతో అమెరికాకు వెళ్తున్నారు. అమెరికాలో గత ఏడాది నాటికి ఉపాధి ఆధారిత ప్రాధాన్య క్యాటగిరీలో దాదాపు 4 ల‌క్ష‌ల‌ మంది విదేశీయులు గ్రీన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారని - వీరిలో భారతీయులే 3,06,601 మంది ఉన్నారని యూఎస్‌ సీఐఎస్ వెల్లడించింది. ఈ జాబితాలో భారత్ తర్వాత చైనా 67,031 మందితో ద్వితీయ స్థానంలో ఉంది. ఇక మిగిలిన ఏ దేశానికి చెందిన వారు కూడా 10 వేల మందికి మించి లేరని యూఎస్‌ సీఐఎస్ వివరించింది.

ట్రంప్ తాజా నిర్ణ‌యం ఫ‌లితంగా అమెరికాలో ప్ర‌స్తుతం తాత్కాలికంగా నివాసం ఉంటున్న వారిపై, గ్రీన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారిపై ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ట్రంప్ నిర్ణ‌యం మిలియ‌న‌ల్ కొద్ది ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేస్తుంద‌ని పేర్కొంటున్నారు. అమెరికాలో ప్ర‌స్తుతం హెచ్‌1 వీసాతో ఉంటున్న వారికి - అమెరికాపై ఆశ‌లు పెట్టుకున్న వారికి ఈ నిర్ణ‌యం షాక్ ఇచ్చేద‌ని విశ్లేషిస్తున్నారు.