Begin typing your search above and press return to search.
అధికార దాహంతో ఆ నీచానికి దిగజారిన ట్రంప్..!
By: Tupaki Desk | 22 Jan 2022 4:30 PM GMTప్రపంచంలో కెల్లా అత్యంత శక్తివంతమైన దేశంగా అమెరికా ఉంది. కేవలం ఆర్థికంగానే కాకుండా అనేక విషయాలలో ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా ఒక మెట్టు పైనే ఉంటుంది. అందుకే చాలా దేశాలు అగ్రరాజ్య కనుసన్నల్లోనే నడుస్తుంటాయి. అలాంటి దేశానికి అధ్యక్షుడు కావడం అంటే సామాన్యమైన విషయం కాదు. అంతేకాకుండా అలాంటి అధ్యక్ష పదవిని వదులుకోవడం కూడా ఎవరికీ ఇష్టం ఉండదు.
దీనికి గల ముఖ్య కారణం.. అధ్యక్ష పదవిలో ఉంటే ఆ వ్యక్తికి ఉండే అధికారాలు అటువంటివి. అందుకే గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, అతని అభిమానులు అంత రగడ చేసింది. కేవలం అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచనతో డోనాల్డ్ ట్రంప్ చాలా ఎత్తుగడలు వేశారు. అయినా కానీ చివరకు ఎన్నికల్లో అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్నటువంటి జో బైడెన్ ఎన్నికయ్యారు.
అయితే డోనాల్డ్ ట్రంప్ తన ఆ పదవిని కాపాడుకోవడానికి నానా ప్రయత్నాలు చేశారు. వాటిలో ఒకటి తాజాగా బయటపడిందని వైట్ హౌస్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత అనేక రాష్ట్రాలలో ప్రజలు వేసిన ఓట్లను నిక్షిప్తం చేసే ఓటింగ్ మిషన్లను ఒక దగ్గర భద్రం చేస్తారు. అయితే తాను ఓడిపోతాను అనే భయంతో డోనాల్డ్ ట్రంప్ వాటిని స్వాధీనం చేసుకోవాలని అమెరికా రక్షణ శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేయాలని భావించారంట. ఇందుకు సంబంధించిన ఆ ఉత్తర్వులు తాలూకూ డ్రాఫ్ట్ కూడా వైట్ హౌస్ అధికారుల చేత సిద్ధం చేయించారట. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల వాటిని అధికారికంగా జారీ చేయలేక పోయారట. అదే జరిగి ఉంటే అధ్యక్షుడు ట్రంప్ మరింత చెడ్డ పేరు మూట గట్టుకోవాల్సి వచ్చేదని నిపుణులు చెబుతున్నారు.
అయితే రక్షణ శాఖకు జారీ చేయబడన ఉత్తర్వుల తాలూకూ నకలు ఇటీవల బయటపడిందని అధికారులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు వెలుబడ్డాయి. ఆ ఫలితాల ప్రకా
రం చూస్తే ఓటమి ఖాయం అని ట్రంప్ అభిమానులు అందరూ నిశ్చయించుకున్నారు. అయితే ఓటమిని అంగీకరించలేని మాజీ అధ్యక్షుడు ట్రంప్ అభిమానులు, మద్దతుదారులు ఏకమై గతేడాది జనవరి 6 వ తేదీన క్యాపిటల్ భవనంపై విరుచుకుపడ్డారు. అది పెద్ద రసాభాస మారింది. అనంతం జరిగిన పరిణామాల్లో ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం దీనిపై విచారణ జరిపించాలని భావించింది.
ఇందుకు తగ్గట్టుగానే ఒక హౌస్ కమిటిని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ ఇటీవల దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఆ ఉత్తర్వుల తాలూకు నకలు బయటపడినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ లేఖను ఎవరు రూపొందించారు అనే దానిపై స్పష్టత లేదని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ లేఖ బయటకు రావడం పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నా అధ్యక్షుడు జో బైడెన్ వర్గం.. ట్రంప్ ఇంత కింది స్థాయికి దిగజారాడా అని ఆరోపిస్తోంది. ప్రజల పూర్తి మద్దత్తు బైడెన్ కి ఉండడం వల్లే తాము గెలిచామని చెప్తోంది. ఒక వేళ ఆ ఉత్తర్వులు వెలుబడి ట్రంప్ అనుకున్నది జరిగినా కానీ ఫలితాలు ప్రకటన మరి కొన్ని రోజులు ఆలస్యం అయ్యేది కానీ అంతిమంగా తామే పై చేయి సాధించే వాళ్లమని బైడెన్ మద్దతుదారులు అంటున్నారు.