Begin typing your search above and press return to search.

చైనాను వెనకేసుకొస్తావా? WHOపై ట్రంప్ ఆగ్రహం

By:  Tupaki Desk   |   26 March 2020 5:02 PM GMT
చైనాను వెనకేసుకొస్తావా? WHOపై ట్రంప్ ఆగ్రహం
X
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ పుట్టుక, విస్తరణకు కారణమైన చైనాను WHO వెనకేసుకొస్తోందని.. ఇది నిజంగా విచారిందగ్గ విషయమని ట్రంప్ దుయ్యబట్టారు.అసలు కరోనా వైరస్ పుట్టుకకు చైనీయుల దారుణమైన ఆహారపు అలవాట్లే కారణమని ట్రంప్ విమర్శించారు. చైనీస్ వైరస్ అంటూ ఆడిపోసుకున్నారు.

జనవరిలో WHO డైరెక్టర్ టెడ్రోస్ చైనాలో పర్యటించిన విషయాన్ని ట్రంప్ తప్పు పట్టారు. కరోనా వ్యాప్తిని చైనా అరికట్టిందని టెడ్రోస్ ప్రశంసించడాన్ని ట్రంప్ ఖండించారు. చైనాతో అతడికి పాత సంబంధాలున్నాయని.. అందుకే పొగుడుతున్నాడంటూ మండిపడ్డారు.

ఇక చైనాను పొగిడిన డెమోక్రాట్లపై కూడా ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రపంచానికి వ్యతిరేకంగా WHO తోపాటు డెమోక్రాట్లు చైనాకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. WHO పూర్తిగా చైనాకు అండగా నిలుస్తోందని విమర్శించారు. కరోనాపై చైనాతో కలిసి కుట్రపన్నారని పలువురు నేతలు సైతం విమర్శించిన విషయాన్ని ట్రంప్ ప్రస్తావించారు.