Begin typing your search above and press return to search.

టిక్ టాక్ నిషేధంపై ట్రంప్ తాజా నిర్ణయం

By:  Tupaki Desk   |   15 Aug 2020 3:30 PM GMT
టిక్ టాక్ నిషేధంపై ట్రంప్ తాజా నిర్ణయం
X
ప్రముఖ వీడియో యాప్ టిక్ టాక్ ను అమెరికాలో నిషేధించిన ట్రంప్ తాజాగా మరో ఉత్తర్వు జారీ చేసి కొంత ఊరటనిచ్చారు. టిక్ టాక్ కు 90 రోజుల డెడ్ లైన్ పెట్టారు.

టిక్ టాక్ అమెరికాలో తన కార్యకలాపాలను నిలిపివేయడమో.. లేక తమ దేశ కంపెనీకి టిక్ టాక్ ను విక్రయించడమో చేసేందుకు ఇచ్చిన గడువును తాజాగా పొడిగించారు. టిక్ టాక్ కు తాజాగా 90 రోజుల గడువునిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేశారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం.. నవంబర్ 12 వరకు టిక్ టాక్ కు గడువు లభించింది. టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ఈ తేదిలోపు పూర్తి చేయాల్సి ఉంది.

ఇక అమెరికన్ యూజర్ల డేటాను టిక్ టాక్ పూర్తిగా తొలగించాలని ట్రంప్ స్పష్టం చేశారు.అమెరికా జాతీయ భద్రతను టిక్ టాక్ ప్రమాదంలోకి నెట్టివేస్తుందనడానికి ఆధారాలు న్నాయని.. అందుకే టిక్ టాక్ ను అమెరికా కంపెనీలకు అమ్మేయాలని ట్రంప్ స్పష్టం చేశారు.

కాగా టిక్ టాక్ ను కొనుగోలు చేసేందుకు కొద్దిరోజులుగా మైక్రోసాఫ్ట్ ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్ కార్యకలాపాలను కూడా కొనేందుకు మైక్రోసాఫ్ట్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ట్విట్టర్ కూడా ఈ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తోందని వార్తలు వస్తున్నాయి. మరి టిక్ టాక్ తన వ్యాపారాన్ని అమ్ముకుంటుందా లేదా చూడాలి.