Begin typing your search above and press return to search.
ట్విట్టర్ డీల్ వెనుక ట్రంప్ హస్తంలో నిజమెంత.. ఎలాన్ మస్క్ ఏమన్నాడు?
By: Tupaki Desk | 8 May 2022 4:27 AM GMTటెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ఇటవలే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ట్విట్టర్ ను కొన్న విషయం అందరికీ తెలిసిందే. మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి అందుకు సంబంధించిన ప్రతి అంశం వార్తల్లో నిలుస్తూనే ఉంది అయితే అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రోద్భలంతోనే ఎలామ్ మస్క్... ట్విట్టర్ ను కొనుగోలు చేశారంటూ తాజాగా మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది.
అయితే ఎలాన్ మస్క్ కంటే ముందే ట్విట్టర్ ను కొనుగోలు చేయాలంటూ గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ఆదేశించాడని మాజీ ప్రతినిధి డెవిన్ నున్స్ తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను అరికట్టి, నిజాయితీని నిలబెట్టాలనే ఉద్దేశం తోనే ట్రంప్ ఆ నిర్ణయం తీసుకున్నారని ఒక అంతర్జాతీయ మీడియా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డెవిన్ చెప్పుకొచ్చారు.
అయితే అప్పటికే సాధ్యం కాలేదాని.. అంతే కాకుండా ఎన్నికల సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ట్రంప్ ఖాతాను ట్విట్టర్ తొలగించింది. దీంతో ట్విట్టర్ పై పగ పెంచుకున్న డొనాల్డ్ ట్రంప్... తన సన్నిహితుడైన ఎలాన్ మస్క్ ద్వారా ట్విట్టర్ ను కొనేలా ప్రేరేపించారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టి పారేశారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.
ఈ విషయం పై శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించిన మస్క్.. ఇది అబద్ధం.. ట్రంప్ తో నాకు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా కానీ ఎలాంటి కమ్యూనికేషన్ లేదని వివరించారు. పైగా తాను ప్రత్యేకంగా ట్రూత్ సోషల్ లో ఉంటానని బహిరంగంగా ప్రకటించాడు. ట్విట్టర్ కు ధీటుగా డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషన్ అనే యాప్ ను తీసుకువచ్చారు. అయితే ట్రంప్ సోషల్ మీడియా వయాప్ గా పిలిచే ట్రూత్ సోషల్ పైనా మస్క్ ఇటీవల విమర్శలు గుప్పించడం గమనార్హం.
ఇటీవలే ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేశాక.. మస్క్ బృందం ట్రంప్ ను తిరిగి ఈ సోషల్ మీడియా లోకి తీసుకొస్తారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇవే వార్త లపై అగ్ర రాజ్యం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. 'వ్యక్తిగతంగా నాకు మస్క్ అంటే చాలా ఇష్టం. అయితే నా పట్ల ట్విటర్ ప్రవర్తించిన తీరు పట్ల నేను అసంతృప్తి చెందాను. ఒకవేళ నన్ను ట్విటర్‌లోకి అనుమతించినా నేను మాత్రం రాను' అని స్పష్టం చేశారు.