Begin typing your search above and press return to search.

ఆ దేశాల పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ ..కారణం ఇదే !

By:  Tupaki Desk   |   16 April 2020 4:30 PM GMT
ఆ దేశాల పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ ..కారణం ఇదే !
X
కరోనా మహమ్మారి పై ప్రస్తుతం ప్రపంచంలో ఉండే ప్రతి దేశం కూడా యుద్ధం చేస్తుంది. ఈ మహమ్మారి మొదటగా చైనాలోని వుహాన్ సిటీలో వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత అక్కడి నుండి ఒక్కో దేశానికీ వ్యాప్తి చెందుతూ ఇప్పుడు ప్రపంచమా మొత్తం విస్తరించింది. దీనితో ఈ కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ను విధించాయి. అయినప్పటికీ కూడా కరోనా భారిన పడే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది , తగ్గడం లేదు.

ప్రపంచంలోని ఇతర దేశాలలో పోల్చితే , అమెరికా లో ఈ వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. రోజులో అత్యధిక కేసులు నమోదు అయ్యేది అమెరికాలోనే ..అలాగే అత్యధిక మరణాలు సంభవించేది కూడా అమెరికాలోనే కావడం గమనర్ఘం. తాజా లెక్కల ప్రకారం అమెరికాలో ఇప్పటివరకు 644,348 మందికి కరోనా నిర్దారణ కాగా ..కరోనా వైరస్‌తో మృతిచెందిన వారి సంఖ్య 28,554కి చేరింది.

దీని పై అమెరికా అనేక ఆరోపణలు చేస్తున్నది. అమెరికా మాత్రమే కరోనా కేసుల గురుంచి ఖచ్చితమైన డేటాను ఇస్తోందని, ఇంఫెక్షన్ సోకిన వివరాలు, మరణాల సంఖ్యను నిజాయితీగా వెల్లడిస్తుంది అని , కానీ, చైనా, రష్యా, ఇరాన్, నార్త్ కొరియా లాంటి చాలా దేశాలు డేటాను బయటపెట్టడం లేదని, తప్పుడు డేటాను ఇస్తున్నాయని ట్రంప్ నిరసన వ్యక్తం చేస్తున్నాడు. కాగా , ఈ వైరస్ చైనా వైరస్ అంటూ చైనా పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మొత్తంగా ట్రంప్ రోజుకో విధంగా తమ నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. ఇకపోతే , ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,084,735 మంది కరోనా భారిన పడగా ..134,685 మంది మృతి చెందారు.