Begin typing your search above and press return to search.

ట్రంప్ సలహాలు, సూచనలు అక్కర్లేదట!

By:  Tupaki Desk   |   8 March 2021 1:30 AM GMT
ట్రంప్ సలహాలు, సూచనలు అక్కర్లేదట!
X
అమెరికా అధ్యక్షుడిగా ఉంటూ వలసలను నిషేధించి.. కరోనా విషయంలో నిర్లక్ష్యం చేసి.. ప్రతిపక్షాలపైకి మద్దతుదారులను ఎగదోసి ఎంత రచ్చ చేయాలో అంతా చేశారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన దిగిపోయినా కూడా ఇంకా అమెరికా పరిపాలనలో వేలు పెట్టడం ఆపడం లేదు.

తాజాగా అమెరికా వలస విధానం (ఇమ్మిగ్రేషన్ పాలసీ)పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాలు, సూచనలను తాము తీసుకోబోమని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి స్పష్టం చేశారు.

ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఇమ్మిగ్రేషన్ విధానాలు అవమానకరమైనవని.. అవి ఉపయోగంలో లేవని జెన్ సాకి అన్నారు. ఇమ్మిగ్రేషన్ అంశంపై అధ్యక్షుడు జోబైడెన్ తీసుకుంటున్న నిర్ణయాలను జెన్ సాకి స్వాగతించారు. తాము సొంత మార్గాన్ని ముందుకు తీసుకెళుతున్నామని జెన్ సాకి తెలిపారు. వలస దారుల పిల్లల విషయంలో మానవత్వంతో గౌరవంతో వ్యవహరిస్తున్నామన్నారు. ఇమ్మిగ్రేషన్ విధానంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు. ట్రంప్ సలహాలు అమెరికాకు ఏమాత్రం అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.

తాజాగా జోబైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇమ్మిగ్రేషన్ విధానాలపై ట్రంప్ విమర్శించారు. ఈ వలస విధానంతో దక్షిణ అమెరికాలో వలసలు పెరిగిపోయాయని ట్రంప్ విమర్శించాడు. తన హయాంలో తీసుకున్న నిర్ణయాలను జోబైడెన్ వెనక్కి తీసుకోవడం వల్ల సరిహద్దులో సంక్షోభానికి దారితీసిందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించాడు.

తాజాగా ట్రంప్ పై కోర్టులో దావా వేశారు. జనవరి 6న కేపిటల్ భవనంపై అల్లర్లను ప్రోత్సహించిన ట్రంప్ డెమొక్రటిక్ చట్టసభ సభ్యుడు స్వాల్ వెల్ కోర్టులో దావావేశారు.