Begin typing your search above and press return to search.

కరోనా గురించి సరికొత్త విషయాలను బయట పెట్టిన ట్రంప్ ..ఏవంటే !

By:  Tupaki Desk   |   24 April 2020 12:30 PM GMT
కరోనా గురించి సరికొత్త విషయాలను బయట పెట్టిన ట్రంప్ ..ఏవంటే !
X
అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ బారిన పడి అల్లాడిపోతోంది. ఇప్పటికే అమెరికాలో 49 వేల మందికి పైగా కరోనా భారిన పడి మరణించారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తొమ్మిది లక్షలకి దగ్గరగా వచ్చింది. కరోనా వైరస్ తీవ్రతను నియంత్రించడానికి అమెరికా శాస్త్రవేత్తలు - వైద్య నిపుణులు పెద్ద ఎత్తున పరిశోధనలను కొనసాగిస్తున్నారు. డిపార్ట్‌ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నేతృత్యంలో కొనసాగుతోన్న ఈ పరిశోధనలకు సంబంధించిన వివరాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వెల్లడించారు.

ఎండ తీవ్రంగా ఉన్న వాతావరణంలో వైరస్ కదలికలు నెమ్మదిగా ఉంటాయని - ఈ తరహా వాతావరణం లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందదు అని ట్రంప్ వెల్లడించారు. ఎండ తీవ్రత - అల్ట్రా వయోలెట్ కిరణాలు - ఐసొప్రొఫిల్ అల్కహాల్‌ తో దాన్ని కట్టడి చేయవచ్చనడానికి సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. గురువారం ఆయన తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హోమ్‌ల్యాండ్ చీఫ్ బిల్ బ్రియాన్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ పలు అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

గాలిలో తేమశాతం కూడా కరోనా వైరస్ కదలికలపై ప్రభావాన్ని చూపుతుందని, గాలిలో తేమ శాతం అధికంగా ఉంటే వైరస్ కదలికలు చురుగ్గా ఉంటాయని డిపార్ట్‌ మెంట్ ఆఫ్ హోమ్ ‌ల్యాండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఈ విషయం తేలిందని అయన తెలిపారు. ఇన్‌ డోర్ - వేడి వాతావరణం లో కరోనా వైరస్ ఎక్కువ సేపు ఉండబోదని, సూర్యకిరణాలు నేరుగా ఆ వైరస్ మీద ప్రసారమైనా అది ఎక్కువ సేపు జీవించ లేదని వెల్లడించారు. ఈ కోణంలో మరిన్ని పరిశోధనలను చేయాల్సి ఉందని, మేరీల్యాండ్ ల్యాబోరేటరీ నివేదికలను పరిశీలించాల్సి ఉందని ట్రంప్ చెప్పారు. ఎండ తీవత్ర అధికంగా ఉండే ప్రాంతాల్లో కరోనా వైరస్ మటుమాయం అవుతోందనే విషయం తమ పరిశోధనల్లో తేలిందని బిల్ బ్రియాన్ తెలిపారు