Begin typing your search above and press return to search.
ట్రంప్ తగ్గట్లేదు.. చైనాతో బిగ్ ఫైట్
By: Tupaki Desk | 18 Sep 2018 9:51 AM GMTచైనా.. పారిశ్రామికంగా దూసుకుపోతున్న దేశం. ఆ దేశంలో భారీగా ఉన్న మానవ వనరులను ఉపయోగించుకొని చాలా చీప్ గా వస్తువులు, వివిధ పారిశ్రామిక యంత్రాలను తయారు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తోంది. చైనా వస్తువులు చీప్ కావడంతో జనాలు ఎగబడి కొనేస్తున్నారు. ఇలా కోట్ల రూపాయల విదేశీ ధనం చైనాకు వచ్చిపడుతూ ఆ దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. కానీ ఇప్పుడు తమ దేశం, తమ అభివృద్ధి అని పెట్టుకున్న ట్రంప్ చైనా ఉత్పత్తుల వల్ల అమెరికాలో ఉపాధి, అవకాశాలు సన్నగిల్లుతున్నాయని.. కంపెనీలు నష్టపోతున్నాయని సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అమెరికాకు ఎగుమతి చేసే దాదాపు 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది.
200 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై 10శాతం దిగుమతి సుంకం విధిస్తున్నట్టు అమెరికా ప్రభుత్వం పేర్కొంది. సెప్టెంబర్ 24 నుంచి ఈ సుంకాలు అమల్లోకి రానున్నాయి. కాగా ఆ తర్వాత జనవరి 1, 2019 నుంచి ఈ సుంకాన్ని 25శాతానికి పెంచబోతున్నట్టు ట్రంప్ బాంబు పేల్చాడు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘ ఇప్పటికే చైనా వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. చైనా మా రైతులు - ఇతర పరిశ్రమలపై ప్రతీకార చర్యలకు దిగితే మేం వెంటనే మరింత సుంకాలు పెంచుతాం. మరో 267 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తాం’ అంటూ హెచ్చరించాడు.
ఇలా చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం పీక్ స్టేజ్ కు చేరింది. చైనా అన్యాయమైన వాణిజ్య విధానాలు అమలు చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ ఏడాది జూన్ లో 50 మిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై పన్ను విధించిన అమెరికా ఈసారి ఏకంగా 200 బిలియన్ డాలర్ల ఎగుమతులపై పెంచేసింది. దీనిపై చైనా కూడా ధీటుగా స్పందించింది. అమెరికా ఉత్పత్తులపై కూడా తాము పన్ను విధిస్తామని హెచ్చరించింది. దీంతో అమెరికా-చైనా వార్ ప్రపంచవ్యాప్తంగా గుబులు రేపుతోంది.