Begin typing your search above and press return to search.

మోడీ ఫెయిల్యూర్.. ఢిల్లీ అల్లర్లపై ట్రంప్ హాట్ కామెంట్

By:  Tupaki Desk   |   27 Feb 2020 6:35 AM GMT
మోడీ ఫెయిల్యూర్.. ఢిల్లీ అల్లర్లపై ట్రంప్ హాట్ కామెంట్
X
ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగి 30మంది వరకూ చనిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.దీనిపై ఇప్పటికే అమెరికా స్పందించగా.. తాజాగా ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రెటరీ అంటోనియో గుట్రెస్ స్పందించారు. ఢిల్లీ అల్లర్ల మృతులకు సంతాపం తెలిపారు. అల్లర్లు జరుగుతున్నందున శాంతియుతంగా ఉండాలని.. హింసను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.

ఇక ఢిల్లీలో అల్లర్లపై యూనైటెడ్ స్టేట్స్ కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలో ముస్లింలపై జరిగిన దాడులపై పోలీసులు జోక్యం చేసుకోలేదని.. ఆందోళనలు, ఉద్రిక్త పరిస్థితికి అదే కారణమని ఆ సంస్థ కమిషనర్ అనురిమా భార్గవ మండిపడ్డారు.

ప్రజాస్వామ్యంలో నిరసన తెలుపవచ్చని.. శాంతియుతంగా నిరసన తెలుపాలని ఐక్యరాజ్యసమితి హౌస్ ఫారిన్ కమిటీ అభిప్రాయ పడింది.

ఇక అమెరికా ప్రతిపక్ష నేత, డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి బెర్నీ సాండర్స్ తాజాగా ట్రంప్ పర్యటనపై విమర్శించారు. ఢిల్లీలో అల్లర్లు జరుగుతుండగా ట్రంప్ పర్యటించడం అవసరమా అని నిలదీశారు. ఢిల్లీలో అల్లర్లలో ముస్లింలే చనిపోయారని సాండర్స్ మండిపడ్డారు.

కాగా సాండర్స్ ప్రశ్నకు అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఢిల్లీ అల్లర్లకు కారణం మానవ హక్కులను కాపాడడం లో నాయకత్వ వైఫల్యమని ట్రంప్ అన్నారు. దీన్నిబట్టి అల్లర్లను అరికట్టడంలో మోడీ ఫెయిల్ అయ్యాడని ట్రంప్ చెప్పకనే చెప్పాడు.