Begin typing your search above and press return to search.
ట్రంప్ అభిశంసన.. అమెరికా చరిత్రలో మొదటి అధ్యక్షుడిగా చెత్త రికార్డు
By: Tupaki Desk | 14 Jan 2021 3:33 AM GMTచేతులారా చెడగొట్టుకోవటం అంటే ఇదే. అత్యుత్తమ స్థానంలో ఉండి గౌరవనీయమైన నిష్క్రమణకు భిన్నంగా అవమాన భారంతో బయటకు వెళ్లాల్సిన దుస్థితిని కొని తెచ్చుకోవటంలో డొనాల్డ్ ట్రంప్ తర్వాతే ఎవరైనా. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన వారిలో వివాదాస్పద అధ్యక్షుడిగా ఇప్పటికే పేరున్న ట్రంప్.. తాజాగా మరో చెత్త రికార్డును తన పేరిట రాయించుకున్నారు. క్యాపిటల్ హిల్స్ భవనంపై దాడికి ప్రోత్సహించారంటూ అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్ పై పెట్టిన అభిశంసన తీర్మానానికి మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపారు.
దీంతో.. అమెరికా చరిత్రలో రెండోసారి అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ ఒక చెత్త రికార్డును సొంతం చేసుకున్నారు. చరిత్రలో నిలిచిపోనున్నారు. క్యాపిటల్ హిల్ భవనంలోకి ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ముట్టడించటం.. దాడి చేయటంతో పాటు ఆరాచకాన్ని క్రియేట్ చేవారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణల్లో ఐదుగురు మరణించారు. ట్రంప్ కావాలనే ఇదంతా చేసినట్లుగా ఆరోపిస్తూ డెమొక్రాట్లు ట్రంప్ పై ప్రతినిధుల సభలో అభిశంసన పెట్టారు.దీనికి మెజార్టీ సభ్యలు మద్దతు ఇవ్వటంతో ట్రంప్ అభిశంసనకు గురయ్యాడు. ఈ తీర్మానాన్ని సెనెట్ కు పంపనున్నారు.
అయితే.. దీనిపై విచారణ మాత్రం కొత్త అధ్యక్షుల వారి సమక్షంలోనే జరగనుంది. ఈ నెల 20న జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతల్ని చేపట్టనున్నారు. తాజా అభిశంసనలో డెమొక్రాట్లకు మద్దతుగా ట్రంప్ పార్టీకి చెందిన నేతలు కూడా మద్దతు పలికారు. దీంతో.. ఆయన అభిశంసన గురి కాక తప్పలేదు. చేసుకున్నోడికి చేసుకున్నంత అని ఊరికే అనలేదు మరి. ట్రంప్ ఆ విషయాన్ని ఇప్పటికైనా గుర్తిస్తారా?