Begin typing your search above and press return to search.
ట్రంప్ నకు ఇన్ ఫ్రంట్ క్రోకోడైల్ ఫెస్టివల్
By: Tupaki Desk | 4 Aug 2020 12:30 AM GMTకరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ కుదేలయ్యాయి. ఈ ప్రాణాంతక వైరస్ దెబ్బకు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. అగ్రరాజ్యం అమెరికా నుంచి అనామక రాజ్యం వరకు మునుపెన్నడూ కనీ వినీ ఎరుగని ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా వల్ల అనివార్యమైన లాక్ డౌన్ వల్ల అమెరికా వంటి అగ్రరాజ్యం సైతం అతలాకుతలమైంది. అందుకే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దేశ ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా ఉండేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యం కన్నా ఆర్థిక రంగానికే ట్రంప్ పెద్ద పీట వేశారు. అయితే, ట్రంప్ సాహసోపేత నిర్ణయం ట్రంప్ ను చిక్కుల్లో పడేసింది. ఆర్థిక రంగం గాడిలో పడడం మాట దేవుడెరుగు....అమెరికన్ల ఆరోగ్యంతో ట్రంప్ ఆటలాడారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
మార్కెట్లను ట్రాక్ లోకి తెచ్చేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇపుడు, కరోనాపై ట్రంప్ ఉదాసీన వైఖరి...ఆయన పదవికే ఎసరు పెట్టే అవకాశాలున్నాయని సర్వేలు కుండబద్దలు కొడుతున్నాయి. అమెరికా అధ్యక్ష రేసులో ట్రంప్ కంటే డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ముందున్నట్టుగా సర్వేలు చెబుతున్నాయి. 50 శాతం మంది అమెరికన్లు....బైడెన్ కు మద్దతుగా నిలవగా....41 శాతం మంది మాత్రమే ట్రంప్ కు మద్దతు పలికారు. జులైలో జరిపిన సర్వేలో ట్రంప్ కంటే బైడెన్ 9శాతం ఓట్లతో ముందంజలో ఉందని తేలింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఎన్నికల వాయిదా అంటూ కొత్త పల్లవి అందుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే, 244 ఏళ్ల అమెరికా చరిత్రలో అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడిన దాఖలాలు లేవు. అమెరికా అంతర్యుద్ధం (1861–65), 1918లో స్పానిష్ ఫ్లూ, రెండో ప్రపంచ యుద్ధం సమయంలోనూ అమెరికా అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడలేదు.
కానీ, 26-11 దాడుల తర్వాత న్యూయార్క్ మేయర్ ఎన్నికలు, కరోనా వల్ల పలు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ ఎన్నికలు వాయిదా పడడం మాత్రమే జరిగాయి. అయితే, ట్రంప్ మాత్రం కరోనా నేపథ్యంలో ఎన్నికల వాయిదాకే మొగ్గు చూపుతున్నారట. అయితే, మెయిల్ ఇన్ ఓటింగ్ పద్ధతిలో ఎన్నికలు జరపవచ్చన్నది డెమొక్రాట్ల వాదన. ఈ పధ్దతిలో ఓటర్లకు సంబంధిత అధికారులు బ్యాలెట్ పేపర్లను అందిస్తారు. ఆ ఓటరు దానిని నింపి తిరిగి అధికారులకి పంపించి ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఈ విధానంలో విదేశీ జోక్యం అధికమని, ఫలితాల్లో తీవ్ర జాప్యం ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే, ట్రంప్ ఓడిపోయినా...మెయిల్ ఇన్ ఓటింగ్ విధానంపై తప్పంతా నెట్టివేయొచ్చన్న యోచనలో ట్రంప్ ఉన్నట్టు పరిశీలకులు అంటున్నారు.
కానీ, కొలరాడో, హవాయి, ఒరెగాన్, వాషింగ్టన్, ఉటా రాష్ట్రాల్లో మెయిల్ ఇన్ ఓటింగ్ ను అనుసరిస్తున్నారని, ఈ విధానంలో 0.4% కూడా అవకతవకలు జరగవని ఎన్నికల విశ్లేషకుడు రిచర్డ్ ఎల్ హసన్ అంటున్నారు. వాస్తవానికి, అమెరికాలో ఎన్నికలు నాలుగేళ్లకి ఒకసారి జరుగుతాయి. నవంబర్ నెల మొదటి సోమవారం మర్నాడు వచ్చే మంగళవారం ఎన్నికలు జరగాలన్నది అక్కడి చట్టం. ఈ చట్టం ప్రకారం వాస్తవానికి ఈ ఏడాది నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ట్రంప్ అనుకున్నట్లు ఈ ఎన్నికలు వాయిదా వేయడం అంత సులువు కాదు. ఒకవేళ ఏదన్నా కారణంతో అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడాలంటే దానికి కాంగ్రెస్ ఆమోదం కావాలి. అయితే, కాంగ్రెస్‌లోని సెనేట్‌లో రిపబ్లికన్లకి పట్టుంంది. మరోవైపు, హౌజ్ ఆఫ్ కామర్స్ లో డెమొక్రాట్లకు బలం ఎక్కువ. ఈ రెండు హౌజ్ లలో ఏకాభిప్రాయం కుదిరితేనే ఎన్నికలు వాయిదా పడతాయి.
ఒక వేళ కరోనా వల్ల ఎన్నికలు వాయిదా పడినా....ట్రంప్ అధ్యక్షుడిగా ఎక్కువకాలం కొనసాగలేరు. అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేస్తే ప్రతినిధుల సభని నిర్వహించడానికి వీలులేదు. ఆ సందర్భంలో అధ్యక్షుడిని సెనేట్ ఎంపిక చేయాలి. ఒకవేళ సెనేట్ ఆ పని చేయలేకపోతే స్పీకరే అమెరికా మలి అధ్యక్షుడవుతారు. అమెరికా చట్ట ప్రకారం జనవరి 20లోగా కొత్త అధ్యక్షుడు వచ్చి తీరాల్సిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ మెయిల్ ఇన్ ఓటింగ్ పద్ధతిలో ఎన్నికలు జరిగినా...ట్రంప్ వైపు అమెరికన్లు మొగ్గు చూపకపోవచ్చన్నది వారి అంచనా. ఏది ఏమైనా లోకల్ సెంటిమెంట్ తో మరోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపడదామన్న ట్రంప్ కల.... కలగానే మిగిలిపోతుందేమోనని అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ కు ముందుంది మొసళ్ల పండగేనని అంటున్నారు.