Begin typing your search above and press return to search.

భారత్ లో అమెరికా అధ్యక్షులు.. చరిత్ర ఇదే!

By:  Tupaki Desk   |   24 Feb 2020 5:30 AM GMT
భారత్ లో అమెరికా అధ్యక్షులు.. చరిత్ర ఇదే!
X
భారత్ లో పర్యటిస్తున్న 7వ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ చరిత్రలో నిలిచిపోయారు. అయితే ట్రంప్ భారత్ కు రావడం ఇదే తొలిసారి కాదు. 2014లో రియల్ ఎస్టేట్ వ్యాపార వేత్తగా పర్యటించాడు. కానీ ఈసారి అమెరికా అధ్యక్షుడి హోదాలో పర్యటిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

భారత్ కు వచ్చిన మొదటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్ ఐసన్ హోవర్. ఈయన 1959లో రష్యాతో ప్రచ్ఛన్నయుద్ధం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు భారత్ లో పర్యటించారు. భారత్ లో పర్యటించిన మొదటి అధ్యక్షుడు ఈయనే. అగ్రరాజ్యాధినేతలు ఒక దేశంలో పర్యటిస్తున్నారంటే అది ప్రపంచవ్యాప్తంగా భారత్ కు మంచి గుర్తింపును తెచ్చిపెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆ తర్వాత జాన్ కెన్నెడీ, లిండన్ జాన్సన్ అనే అమెరికా అధ్యక్షులు భారత్ లో పర్యటించారు. 1969లో రిచర్డ్ నిక్సన్, 1978లో మొరార్జీ దేశాయ్ ప్రధాని గా ఉన్నప్పుడు జిమ్మీకార్టర్ భారత్ లో పర్యటించారు.

ఇక 2000 సంవత్సరంలో బిల్ క్లింటన్ ప్రపంచం లో పెరుగుతున్న భారత్ ప్రాధాన్యతను గుర్తించి ఇండియా లో పర్యటించారు. ఆ తర్వాత గద్దెనెక్కిన ప్రతీ అధ్యక్షుడు భారత్ లో పర్యటించడం విశేషం.

2006లో జార్జి డబ్యూ బుష్ భారత్ లో పర్యటించి న్యూక్లియర్ ఒప్పందంపై సంతకం చేసి భారత్ అణు కార్యక్రమానికి దోహదపడ్డారు. మన్మోహన్ తో బుష్ చేసుకున్న ఒప్పందంతో భారత్ అణ్వాయుధ శక్తిని పెంచుకుంది. అణు రంగంలో పురోగతి సాధించింది.1974 అణుపరీక్షల తర్వాత భారత్ పై విధించిన ఆంక్షలను బుష్ ఎత్తివేసి ఊరట కల్పించారు.

ఇక ఆతర్వాత గద్దెనెక్కిన బరాక్ ఒబామా రెండు సార్లు భారత దేశాన్ని సందర్శించారు. ఇలా రెండు సార్లు వచ్చిన ఏకైక అధ్యక్షుడు ఒబామానే కావడం విశేషం. 2010లో ఒబామా మొదటిసారి భారత్ కు రాగా.. 2015లో మోడీ హయాంలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు రెండోసారి గెస్ట్ గా ఒబామా వచ్చారు.