Begin typing your search above and press return to search.
అమెరికాలో టిక్ టాక్ బ్యాన్...ట్రంప్ సంచలన నిర్ణయం
By: Tupaki Desk | 18 Sep 2020 4:59 PM GMTగత కొంతకాలంగా చైనాతో సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో చైనా ఉత్పత్తులు, చైనా సాంకేతికతపై భారత్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. సరిహద్దులో భారత్ తో చైనా కయ్యానికి కాలు దువ్వడంతో పలు చైనాయాప్ లపై కేంద్ర ప్రభుత్వం గతంలో కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశ సమగ్రత, సార్వభౌమత్వానికి, దేశ రక్షణకు, ప్రజా సంక్షేమానికి హానికరంగా భావిస్తున్న కార్యకలాపాలతో సంబంధం ఉందన్న కారణంతో టిక్ టాక్, వుయ్ చాట్ సహా పలు యాప్ లను నిషేధించింది. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాలోనూ టిక్ టాక్ ను అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్ సంస్థలకు అప్పగించాలని ట్రంప్ సర్కార్ సూచించింది. అయితే, ఒరాకిల్ తో టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ఒప్పందం కుదిరిందని ప్రచారం జరిగింది. తాజాగా ఈ ఒప్పందం కుదరకపోవడంతో ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో సెప్టెంబరు 20 నుంచి టిక్ టాక్, వుయ్ చాట్ లను బ్యాన్ చేస్తున్నామని ట్రంప్ ప్రకటించారు.
అమెరికాలో టిక్ టాక్, వుయ్ చాట్లను నిషేధిస్తూ ట్రంప్ శుక్రవారంనాడు ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 20 నుంచి అమెరికాలో ఈ యాప్ లు డౌన్ లోడ్ చేసుకునే వీలులేదని యూఎస్ డిపార్ట్మెంట్ అఫ్ కామర్స్ తెలిపింది. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ… అమెరికా జాతీయ భద్రత, విదేశాంగ విధానం, ఆర్థిక వ్యవస్థను బెదిరించడానికి ఈ యాప్ లను ఉపయోగించుకుంటోందని ఆరోపణల నేపథ్యంలో ఆ యాప్లను బ్యాన్ చేశామని అమెరికా అధికారులు చెప్పారు. గతంలోనే తమ దేశ టిక్ టాక్ వినియోగదారుల సమాచారం చైనాకు చేరుతుందంటూ ఆందోళన వ్యక్తమైందని,అందుకే తాజాగా బ్యాన్ విధించామని తెలిపారు. టిక్‌టాక్‌కు అమెరికాలో 8 కోట్ల మంది యాక్టివ్ యూజర్స్ ఉండగా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. తాజాగా ఈ యాప్ లపై బ్యాన్ విషయంలో భారత ప్రధాని మోడీ బాటలోనే ట్రంప్ నడిచినట్లయింది.