Begin typing your search above and press return to search.
ఇలాగే ఉంటే పోలీసులను తొలగిస్తానంటున్న ట్రంప్
By: Tupaki Desk | 31 July 2017 7:04 AM GMTతన - పర అనే బేధం ఏ మాత్రం చూడకుండా రచ్చ చేసుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు కలకలం రేపే కామెంట్లు చేశారు. ఈ దఫా ఆయన ఏకంగా పోలీసు ఆఫీసర్లనే బెదిరించేశారు. ఈ పరిణామం ఇప్పుడు అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. న్యూయార్క్ లోని సఫోల్క్ కౌంటీ కమ్యూనిటీ కాలేజీలో లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల సమావేశం సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారంటూ కామెంట్ చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రజలు, పోలీసుల మధ్య సంబంధాలు సజావుగా సాగాలంటే పోలీసులు తమ వ్యవహార శైలిని విడనాడాలని ట్రంప్ ప్రభుత్వం కోరిందని స్థానిక మీడియా పేర్కొంది. లేనిపక్షంలో పోలీసు అధికారులు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని ట్రంప్ స్పష్టం చేసినట్లు తెలిపింది.
అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను దేశవ్యాప్తంగా పోలీసు అధికారులు తీవ్రంగా ఖండించారు. ఈ పరిణామంపై కొంతమంది పోలీసు అధికారులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. 'ఇదొక తప్పుడు సందేశమని' పోలీసు ఎగ్జిక్యూటివ్ రీసెర్చ్ ఫోరం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చుక్ వెక్సలర్ వాషింగ్టన్ రేడియో స్టేషన్ లో వ్యాఖ్యానించారు. 1991లో లాస్ ఏంజెల్స్ పోలీసు విభాగం అధికారులు రాడ్నీ కింగ్ అనే వ్యక్తిపై చేయి చేసుకున్నపుడు పోలీసుల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని, దాంతో ఆయా విభాగాలు విశ్వాస పునరుద్ధరణ చర్యలు చేపట్టాయని అన్నారు. అనవసరంగా బల ప్రయోగానికి అధికారులు సిద్ధపడాలనుకుంటే ముందుగా అధ్యక్షుడి నుండి అనుమతి అవసరమని అన్నారు. ఇలాంటి వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా అధ్యక్షుడు ట్రంప్ ఇలా మాట్లాడటం ఏమిటని చుక్ అన్నారు.
మరోవైపు చైనా వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. ఉత్తర కొరియాను నియంత్రించడంలో చైనా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ట్రంప్ తీవ్రంగా నిరసించారు. ``వాణిజ్యంలో ఏడాది కాలంలో వందల కోట్ల డాలర్లను వారు సంపాదించేందుకు మన గత నాయకులు అనుమతించారు. కానీ ఉత్తర కొరియాకు సంబంధించి చైనా మనకి చేసిందేమీ లేదు. కేవలం మాటలు తప్ప చేతల్లేవు`` అని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ప్రెస్ టివి తెలిపింది. ''ఇక ఈ పరిస్థితిని కొనసాగించేందుకు అనుమతించ రాదు.'' అని ఆయన గట్టిగా చెప్పారు. చైనా అయితే ఈ సమస్యను తేలిగ్గా పరిష్క రించగలదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియాకు, క్షిపణి కార్యక్రమానికి కళ్ళెం వేయాల్సిందిగా గతంలో చైనాపై ట్రంప్ ఒత్తిడి తెచ్చారు. కాగా తమ గురించి ట్రంప్ చేసిన తాజా ప్రకటనలపై చైనా అధికారులు ఇంకా స్పందించలేదు. అమెరికా ప్రధాన భూభాగాన్ని తాకగల సామర్థ్యం తమ సొంతమంటూ ఉత్తర కొరియా శనివారం తాజాగా రెండో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు వెలువడ్డాయి.