Begin typing your search above and press return to search.
అడుగిడిన ట్రంప్.. నిమిషానికి ఎంత ఖర్చో తెలుసా?
By: Tupaki Desk | 24 Feb 2020 7:30 AM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో అడుగుపెట్టారు. అహ్మదాబాద్ లోని విమానాశ్రయంలో దిగిన ట్రంప్ కు ప్రధాని మోడీ ఎదురెళ్లి స్వాగతం పలికారు. రెడ్ కార్పేట్ స్వాగతం లభించింది. సంప్రదాయ నృత్యకారులు ట్రంప్ కు స్వాగతం పలికారు.
ట్రంప్ కోసం కేంద్రం, గుజరాత్ సర్కారు భారీగా ఖర్చు చేస్తోంది. మోడీ ఇజ్జత్ కా సవాల్ గా ఖర్చును భారీగా పెడుతున్నారట.. ట్రంప్ టూర్ కోసం గుజరాత్ సర్కారు ఏకంగా 100 కోట్లు ఖర్చు చేస్తోంది. కేవలం 3 గంటల ఈ పర్యటనకు 100 కోట్లు అంటే మాటలు కాదు కదా.. దాదాపు నిమిషానికి రూ.55 లక్షలు ఖర్చు చేస్తోందన్నమాట.. అంటే గుజరాత్ బడ్జెట్ లో ఈ మొత్తం ఏకంగా 1.5 శాతం అన్నమాట..
ట్రంప్ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా.. ఖర్చు విషయంలో వెనుకాడవద్దని ప్రధాని మోడీ గుజరాత్ సర్కారు ను ఆదేశించారు. అహ్మదాబాద్ నగరం ముస్తాబైంది. రోడ్లు తళతళ మెరుస్తున్నాయి. గోడలకు పెయింటింగ్స్, ట్రంప్ వెళ్లే మార్గంలో అద్దంలా తయారు చేశారు. రోడ్ల కోసమే 60 కోట్లు ఖర్చు చేశారు.