Begin typing your search above and press return to search.
ఇంత మూర్ఖత్వమేంది? ఇలాంటోడ్ని అమెరికా మళ్లీ చూడదేమో?
By: Tupaki Desk | 30 Nov 2020 4:00 PM GMTమూర్ఖత్వానికి నిలువెత్తు రూపంలా వ్యవహరిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో దారుణంగా ఓడినప్పటికీ.. తాను ఓడిపోలేదంటూ తొండి వాదన షురూ చేయటం తెలిసిందే. తాను గెలిచానని.. ఎన్నికల్లో డెమొక్రాట్లు అక్రమాలకు పాల్పడినట్లుగా పేర్కొంటూ నానా యాగీ చేస్తున్నారు. అతగాడు వినిపిస్తున్న వాదనకు సొంత పార్టీ నేతలు సైతం అవాక్కు అవుతున్నారు. ఓటమి వేళ.. హుందాగా వ్యవహరిస్తే తనకున్న ఇమేజ్ ఏమవ్వాలని అనుకుంటున్నారో ఏమో కానీ.. వరుస పెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నా.. ఆయన మాత్రం అస్సలు తగ్గటం లేదు.
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆయన న్యాయస్థానాల్ని ఆశ్రయించటం.. అక్కడా ఎదురుదెబ్బలు తగలటం తెలిసిందే. ఇలాంటి వేళ.. ఆయన చేసిన ట్వీట్ ఒకటి ఆసక్తికరంగా మారటమే కాదు.. అవాక్కు అయ్యేలా చేస్తోంది. ఇలాంటి మనిషి ఇంతకాలం అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్నారా? అన్న సందేహం కలుగుక మానదు. ఎందుకంటే.. తాజాగా ఆయన చేసిన ట్వీట్ లో.. ఒక వీడియోను పోస్టు చేశారు. అది అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్ పాల్గొన్న ప్రచార సభ. దానికి పెద్ద ఎత్తున మద్దతుదారులు పాల్గొన్నారు.
ఆ వీడియోను పోస్టు చేసిన ట్రంప్.. ఎన్నికల్లో ఓడిపోయే అవకాశమే లేదని ట్వీట్ చేశారు. ఈ సభలో దాదాపు పాతిక వేల మంది వరకు పాల్గొని ఉంటారు. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టటానికి 77 మిలియన్ల ఓట్లు అవసరమన్నది ట్రంప్ మర్చిపోకూడదని ఒక నెటిజన్ పేర్కొన్నారు. ‘‘అమెరికా అధ్యక్ష పదవికి 77 మిలియన్ల ఓట్లు అవసరం. ఈ చిన్నపాటి లెక్క మీకు అర్థం కావటం లేదా?’’ అని పేర్కొన్నారు. ఎన్నికల్లో మోసం జరిగిందని చెబుతూ.. తన ఎన్నికల ప్రచార సభకు జనం భారీగా హాజరైతే ఎన్నికైనట్లేనా?
ఎన్నికల్లో గెలుపునకు ప్రామాణికం.. ప్రచార సభల్లో భారీగా జనం హాజరు కావటమే అయితే.. ఎన్నికల పేరుతో అంత పెద్ద ప్రాసెస్ ఎందుకు? భారీ సభను ఏర్పాటు చేసి.. దానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చేలా చేసి.. నేనే గెలిచానని ప్రకటించుకుంటే సరిపోతుంది కదా? ట్రంప్ పోస్టు చేసిన ట్వీట్ ను పలువురు తప్పు పడుతున్నారు. తాజా ట్వీట్ తో తనలోని మొండితనం.. అంతకు మించిన మూర్ఖత్వం ఎంతన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://twitter.com/DanScavino/status/1326365873045712896?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1333245684011642881|twgr^|twcon^s3_&ref_url=https://d-7133561982185127638.ampproject.net/2011070101001/frame.html