Begin typing your search above and press return to search.
తెలంగాణ ఆడబడుచుకు అంత పెద్ద పదవిచ్చిన ట్రంప్
By: Tupaki Desk | 6 May 2020 5:30 AM GMTభారత సంతతికి చెందిన పలువురికి కీలక బాధ్యతలు అప్పజెప్పటం ఈ మధ్య కాలంలో ఎక్కువగా సాగుతోంది. తాజాగా ఒకప్పటి తెలంగాణ ఆడబడుచు.. అమెరికాలో స్థిరపడిన సరితా కోమటిరెడ్డిని న్యూయార్కు ఫెడరల్ కోర్టు జడ్జిగా నియమిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబందించిన సిఫార్సును ఆయన చేశారు.
సెనేట్ కానీ ఆమోదిస్తే.. ఆమె న్యూయార్కులోని తూర్పు జిల్లా కోర్టుకు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తారు. తెలంగాణలో పుట్టి పెరిగిన సరితా కోమటిరెడ్డి తర్వాతి కాలంలో హార్వర్డ్ లా స్కూల్ లో గ్రాడ్యుయేషన్ పట్టా పొందరు. అంతర్జాతీయ నార్కోటిక్స్.. మనీలాండరింగ్.. హాకింగ్ అండ్ ఇంటెలెక్యువల్ ప్రాపర్టీ కో ఆర్డినేటర్ గా పని చేసిన ఆమె.. గతంలో కొంతకాలం లెక్చరర్ గా పని చేశారు.
కొలంబియా స్కూల్.. వాషింగ్టన్ వర్సిటీలోని లా స్కూల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పిన సరితా రెడ్డి లా క్లర్కుగా కూడా పని చేశారు. సరితా కోమటిరెడ్డి తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లే. ఏమైనా ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన తాజా నియామకం తెలంగాణ ఆడబడుచుకు దక్కిన గౌరవంగా చెప్పాలి.ఆమె మరింత ఎత్తులకు ఎదగాలని ఆశిద్దాం.