Begin typing your search above and press return to search.
కిమ్ అనారోగ్యం పై స్పందించిన ట్రంప్..ఏం చెప్పారంటే ?
By: Tupaki Desk | 22 April 2020 6:30 AM GMTప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తున్న అతి పెద్ద సమస్య కరోనా వైరస్. దీనితో ప్రపంచం మొత్తం ఈ కరోనా మహమ్మారి పై పోరాడుతుంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ ...అయితే కరోనా తో పాటుగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ ఏది అంటే అది ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి. నియంత కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య సమాచారం కనుగొనేందుకు ఎప్పుడు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కిమ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ మంగళవారం మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ తర్వాత కిమ్ వారసురాలంటూ తన సోదరి సైతం తెరపైకి వచ్చింది. ఆ తరువాత కిమ్ ఆరోగ్యంగానే ఉన్నారంటూ స్వయంగా శతృదేశమైన దక్షిణ కొరియా ప్రకటించింది. దీనితో కిమ్ ఆరోగ్యంపై అందరిని అనేక అనుమానులు ఏర్పడ్డాయి.
ఈ తరుణంలో కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా స్పందించారు. కిమ్ ఆరోగ్యం మెరుగుపడాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. కిమ్ కు తనకు సత్సంబంధాలే ఉన్నాయన్నారు. కిమ్ బాగానే ఉన్నారని ఆశిస్తున్నానన్నారు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారమైతే ఆయన పరిస్థితి చాలా తీవ్రంగా విషమించినట్టే అని అన్నారు. ఆయన వ్యాఖ్యలతో ఇప్పుడు అంతా డైలమాలో పడ్డారు. ఇంతకీ ఆయన ఆరోగ్యం నిజంగానే క్షీణించిందా..? లేక బాగానే ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది.
గుండెకు శస్త్రచికిత్స అనంతరం కిమ్ ఆరోగ్యం క్షీణించిందని, ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందనే ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని యూఎస్ గమనిస్తోందనే కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన ట్రంప్ ... అతనితో నాకు సత్సంబంధాలే ఉన్నాయి. ఆయన బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వస్తున్న వార్తలు నిజమో, కాదో కూడా నాకు తెలియదు అని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. కిమ్ ఆరోగ్య పరిస్థితి పై ఇప్పటివరకు ఉత్తరకొరియా నుంచి ఎలాంటి ప్రకటన లేదు. అయినప్పటికీ అమెరికా మీడియా మాత్రం దీనిపై ఎన్నో కథనాలను ప్రసారం చేస్తూ వస్తుంది. ప్రస్తుతం కిమ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.
ఉత్తర కొరియాలో వేడుకగా జరిపే తన తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్ హాజరుకాలేదు.ఈ నెల 15 న జరిగిన దేశ వ్యవస్థాపకుడు, కిమ్ తాతయ్య కిమ్ 2 సుంగ్ జయంతి కార్యక్రమాల్లో కిమ్ జాంగ్ ఉన్ కనిపించలేదు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి పై తీవ్ర చర్చ జరుగుతోంది. తాత జయంతి ఉత్సవాల్లో ఎప్పుడూ పాల్గొనే కిమ్ ఈసారి ఉత్సవాల్లో కనిపించలేదు. దానిపై ఉత్తరకొరియా ప్రభుత్వ మీడియా కూడా ఒక ప్రకటన చేయలేదు. దీనితో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇదిలా ఉంటే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఏప్రిల్ 11న పొలిట్ బ్యూరో సమావేశాలకు హాజరైనట్లు ఆదేశ మీడియా తెలిపింది. ఇక ఆ తర్వాత ఉత్తరకొరియా ప్రభుత్వ మీడియాలో కిమ్ గురించి ప్రస్తావనే లేదు.