Begin typing your search above and press return to search.

పౌర‌స‌త్వం ఆర్డ‌ర్‌:ట్రంప్‌ పై భ‌గ్గుమంటున్న అమెరిక‌న్లు

By:  Tupaki Desk   |   31 Oct 2018 2:11 PM GMT
పౌర‌స‌త్వం ఆర్డ‌ర్‌:ట్రంప్‌ పై భ‌గ్గుమంటున్న అమెరిక‌న్లు
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మ‌రోమారు క‌ల‌క‌లానికి వేదిక‌గా మారింది. అమెరికా భూభాగంపై జన్మించిన బిడ్డలకు పుట్టుకతోనే పౌరసత్వం ల‌భిస్తుండ‌గా...ఆ రాజ్యాంగ హ‌క్కును ర‌ద్దు చేయాల‌నుకుంటున్నారు. దాని కోసం ఆయ‌న ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్‌ ను తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.అమెరికా రాజ్యాంగం ప్రసాదించిన జన్మతః పౌరసత్వపు హక్కుకు ఎసరు పెట్టేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు. ప్రస్తుత చట్టాల ప్రకారం అమెరికా పౌరులు కాని వలస ప్రజలు - అక్రమ వలసదారులకు అమెరికా భూభాగంలో పుట్టే పిల్లలకు సహజంగానే అమెరికా పౌరసత్వానికి అర్హత లభిస్తుంది. ఇకమీదట దీనిని రద్దు చేసేలా ట్రంప్ చర్యలు తీసుకోనున్నారు. ఇటీవ‌లే ట్రంప్ ఈ అంశాన్ని లేవ‌నెత్తారు.

అమెరికాలోని వలస ప్రజల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ రకరకాల కొత్త నిబంధనలతో ఇబ్బందులకు గురిచేస్తున్న అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్...మధ్యకాలిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వలస ప్రజలపై మరో కొత్త అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమవుతున్నారు. పౌరులు కాని విదేశీయులు - అక్రమ వలసదారులకు జన్మించే పిల్లలకు పౌరసత్వాన్ని నిరాకరించేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేయనున్నట్టు తాజాగా హెచ్‌ బీవో యాక్సియోస్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. కఠినమైన వలస విధానాలను తీసుకురావడం ద్వారా మధ్యకాలిక ఎన్నికల్లో పనిచేసే తన మద్దతుదారులకు మరింత ఉత్సాహాన్ని ఇవ్వడంతో పాటు అమెరికన్ కాంగ్రెస్‌ పై రిపబ్లికన్లు పట్టుకోల్పోకుండా ట్రంప్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ట్రంప్ వైఖ‌రిపై తీవ్ర నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్‌ తో జ‌న్మ‌త ల‌భించే పౌర హ‌క్కును ర‌ద్దు చేయ‌లేర‌ని ఎంపీ పౌల్ ర్యాన్ అన్నారు. స్వంత పార్టీకి చెందిన ర్యాన్‌...ట్రంప్ నిర్ణ‌యాన్ని గ‌ట్టిగా వ్య‌తిరేకించారు. హౌజ్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్‌ లో స్పీక‌ర్‌ గా ఉన్న పౌల్ ర్యాన్ ... పౌరస‌త్వ హ‌క్కును ర‌ద్దు చేయాల‌నే ప్ర‌తిపాద‌న‌కు వ్య‌తిరేకంగా ఉన్న‌ట్లు తెలిపారు. గ‌తంలో మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా కూడా ఇమ్మిగ్రేష‌న్ చ‌ట్టాల‌ను ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్‌ తో మార్చాల‌ని చూశార‌ని - కానీ వాటిని మేం వ్య‌తిరేకించామ‌ని ఆయ‌న గుర్తు చేశారు. పౌర‌స‌త్వ హ‌క్కును ర‌ద్దు చేయాలంటే రాజ్యాంగ స‌వ‌ర‌ణ అవ‌స‌ర‌మ‌ని రిప‌బ్లిక‌న్ సేనేట‌ర్ చుక్ గ్రేస్లీ తెలిపారు. ఒక క‌లం పోటుతో రాజ్యాంగాన్ని అధ్య‌క్షుడు కూడా మార్చ‌లేర‌ని ఇమ్మిగ్రేష‌న్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ డైర‌క్ట‌ర్ బెత్ వెర్లిన్ తెలిపారు.