Begin typing your search above and press return to search.

ట్రంప్ దెబ్బ‌కు ఆ న‌వ‌ల‌కు డిమాండ్ పెరిగింది

By:  Tupaki Desk   |   30 Jan 2017 7:06 AM GMT
ట్రంప్ దెబ్బ‌కు ఆ న‌వ‌ల‌కు డిమాండ్ పెరిగింది
X
ముస్లిం జనాభా అధికంగా ఉన్న ఏడు దేశాల నుంచి వలసలను 90 రోజులపాటు నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నిర్ణయం ఏకపక్షమని విమర్శిస్తూ.. అమెరికాలోని పలు విమానాశ్రయాల వద్ద వేలమంది ఆందోళనలు చేపట్టారు. మరోవైపు, ట్రాంప్ నిర్ణయం చట్టవిరుద్ధమని పేర్కొంటూ న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి యాన్ డొనెల్లి అత్యవసర స్టే విధించడం, అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు ఉద్రిక్తమవుతుండటంతో ట్రంప్.. తన చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ప్రపంచమంతా గందరగోళంగా మారిందని.. అమెరికాకు పటిష్ఠమైన సరిహద్దులు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అన్నారు. కావాలంటే యూరప్ దేశాల్లో ఏం జరుగుతున్నదో ఓసారి చూడండి అంటూ ఉగ్రదాడులను పరోక్షంగా ప్రస్తావించారు. ఇది ముస్లింలపై నిషేధం ఏమాత్రం కాదని స్పష్టం చేశారు. అయితే, మొత్తంగా ముస్లింలను అమెరికాలోకి అడుగుపెట్టకుండా చేయాలని ట్రంప్ భావించారా..? అంటే ఆయన సహచరుడు ఒకరు అవుననే సమాధానమిస్తున్నారు.

ఇదిలాఉండ‌గా కాలగమనంలో నిరంకుశపాలన వస్తుందని, తన ప్రజలపైనే ప్రభుత్వం నిఘా వ్యవస్థను ఏర్పాటుచేసి ఉక్కుపాదం మోపుతుందని భవిష్యత్‌ ను ఊహించి 1949లో జార్జ్ ఆర్వెల్ రాసిన 1984 అనే నవలకు అమెరికాలో ఇప్పుడు గిరాకీ ఏర్పడింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి పలు విన్నూత చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈ నవలకు డిమాండ్ పెరిగింది కాగా...ముస్లిం జనాభా అధికంగా ఉన్న ఏడు దేశాలకు చెందిన శరణార్థులు అమెరికాలోకి అడుగుపెట్టకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశ న్యాయస్థానం అడ్డుకుంది. అమెరికా పౌరసత్వం ఉన్నవారిని కూడా అడ్డుకోవడం వారి హక్కులకు భంగం కలిగించడమేనని పేర్కొంటూ ఫెడరల్ జడ్జి యాన్ డొనెల్లి స్టే ఉత్తర్వులు జారీ చేశారు. న్యూయార్క్‌ లోని కెన్నడీ విమానాశ్రయంలో దిగిన 14మందిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అన్ని పత్రాలు ఉన్నా.. వారివారి దేశాలకు వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో బాధితులు సామాజిక మాధ్యమాల్లో తమ గోడు వెళ్లబోసుకోవడంతో అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (ఏసీఎల్‌ యూ) న్యూయార్క్ డిస్ట్రిక్ కోర్టును ఆశ్రయించింది. కేసును విచారణ చేపట్టిన ఫెడరల్ జడ్జి యాన్ డొనెల్లీ.. ప్రభుత్వ ఉత్తర్వులు చట్టసమ్మతం కాదని తీర్పునిచ్చారు. తక్షణమే ఎమర్జెన్సీ స్టే విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని తెలిపారు.

మ‌రోవైపు ముస్లిం వలసవాదులపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ కంపెనీల అధినేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ ఈ ప‌రిణామంపై స్పందిస్తూ ట్విట్టర్ తయారైందే.. అన్ని రకాల మతాలకు చెందిన వలసవాదులతోన‌ని గుర్తుచేశారు. ఇప్పుడు వారిని ఒంటరిగా వదిలేయం. ఎల్లప్పుడూ వారితోనే కలిసి ఉంటాం. వారికి అండగా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ట్రంప్ నిర్ణయం బాధాకరన‌మి నెట్‌ ఫిక్స్ సీఈవో రీడ్ హేస్టింగ్స్ వ్యాఖ్యానించారు. ఉబర్ వ్యవస్థాపకుడు ట్రావిస్ కాలనిక్ మాట్లాడుతూ బాధితులకు మావంతు సాయం చేస్తామ‌ని, వారికి అండగా ఉంటామ‌ని ప్ర‌క‌టించారు. వలసవాదులు లేకపోతే ఆపిల్‌ కు మనుగడ ఉండేదే కాదు. ఆవిష్కరణలకు ఆంక్షలు సరికాదని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/