Begin typing your search above and press return to search.
గ్రీన్ కార్డు బిల్లుతో బీపీ పెంచుతున్న ట్రంప్
By: Tupaki Desk | 3 Oct 2019 7:52 AM GMTఅగ్రరాజ్యం అమెరికాలో నివసించాలనుకొని గ్రీన్ కార్డు విషయంలో టెన్షన్ పడుతున్న వారికి మరింత టెన్షన్ కలిగించే పరిణామం ఇది. ఇన్నాళ్లూ డిపెండెంట్ (హెచ్4) వీసాపైనే ఉంటున్న వారి పిల్లలు (ఇండియాలో పుట్టి తల్లిదండ్రులతో పాటు అమెరికా వెళ్లినవారు) - ఇకపై స్టూడెంట్ వీసా (ఎఫ్1) తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే...స్వచ్ఛందంగా అమెరికా నుంచి ఇండియాకు వచ్చేయాలి. ఇటీవల అమెరికా కాంగ్రెస్ లో దేశాలకు ఇచ్చే గ్రీన్ కార్డ్ లిమిట్ ను ఎత్తేసేందుకు రెండు బిల్లులను పెట్టారు. అయితే, అందులో ఒక బిల్లును సెనేట్ తిరస్కరించింది. దీంతో లిమిట్ ను ఎత్తేస్తారని ఆశలు పెట్టుకున్న చాలా మంది ఇండియన్లు నిరాశపడుతున్నారు.
అమెరికాకు వెళుతున్న వారి జాబితాలో ఇండియన్లే ఎక్కువగా ఉంటున్నారు. వీరిలో చాలా మంది ఇండియన్లు హెచ్1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. ఏటా హెచ్1బీ (ఉద్యోగాధారిత) వీసా ఉన్న వారి కోసం అమెరికా ఏటా 1.4 లక్షల గ్రీన్ కార్డులను ఇస్తుంది. అందులో ఒక్కో దేశానికి 7శాతం పరిమితి పెట్టింది. దీంతో, చాలా మంది ఇండియన్లు గ్రీన్ కార్డు కోసం వేచి చూడాల్సి వస్తోంది. ‘‘వేరే దేశాలకు చెందిన జనానికన్నా చాలా మంది ఇండియన్లు గ్రీన్ కార్డుల కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. హెచ్1బీ వీసాపై ఉంటున్న చాలా దేశాల ప్రజలకు దాదాపు ఆరేళ్లలోపే గ్రీన్ కార్డు వస్తోంది. ఇండియన్లకు కనీసం పదేళ్లు పడుతోంది” అని న్యూయార్క్ లోని ఇమిగ్రేషన్ సంస్థ ఫౌండర్ సైరస్ మెహతా చెప్పారు. గత ఏడాది ఏప్రిల్ నాటికి 6.32 లక్షల మంది (భార్యలు - 21 ఏళ్లలోపున్న వారి పిల్లలు సహా) ఇండియన్లు గ్రీన్ కార్డు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. గ్రీన్ కార్డు బ్యాక్ లాగ్ వెయిటింగ్ లిస్టులో ఇండియన్ల వాటానే 76 శాతం. దాన్ని బట్టి మనోళ్లు గ్రీన్ కార్డుల కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
అయితే, ఈ నిరీక్షణ సమయంలో ఇటు ఉద్యోగులకే కాకుండా వారి పిల్లలకు సైతం ఇబ్బందులు కలిగే పరిస్థితి ఎదురవుతోంది. ఇకపై 21 ఏళ్లు నిండిన లేదా నిండబోతున్న వాళ్లందరి పిల్లలు ఎఫ్1 వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్టూడెంట్ వీసా వస్తుందన్న గ్యారెంటీ కూడా లేదు. వీసా రాకపోతే అమెరికాను విడిచి పెట్టి వెళ్లి పోవాల్సి ఉంటుంది. అయితే, హెచ్1బీ వీసా హోల్డర్లకు అమెరికాలోనే పిల్లలు పుడితే వాళ్లకు మాత్రం దీని నుంచి మినహాయింపుంది. కారణం - అక్కడ పుట్టిన వారికి పౌరసత్వం వస్తుంది. దానినీ ఎత్తేయాలని భావిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ మధ్య చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఇటు గ్రీన్ కార్డు రావడంపై నిరీక్షణ అటు విద్యార్థి వీసా స్పష్టత లేక అమెరికాలోని ఉద్యోగులు నలిగిపోతున్నారని తెలుస్తోంది.