Begin typing your search above and press return to search.

తప్పుడు ప్రకటనల్లో ట్రంప్ రికార్డు

By:  Tupaki Desk   |   22 Jan 2019 11:10 AM GMT
తప్పుడు ప్రకటనల్లో ట్రంప్ రికార్డు
X
మాట మీద నిలబడడం అంటే ఏంటో ట్రంప్ కు అస్సలు తెలియదు. ప్రజల్ని గందరగోళానికి గురిచేసే ప్రకటనలు ఇవ్వమంటే మాత్రం నంబర్ వన్. అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ఈ అమెరికా అధ్యక్షుడు ఇప్పటివరకు 8158 తప్పుడు/గందరగోళానికి గురిచేసే ప్రకటనలు ఇచ్చాడు.

అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ ఈ విషయాన్ని నిగ్గుతేల్చింది. తమ దగ్గరున్న డేటాబేస్ సహాయంతో ట్రంప్ ఎన్నిసార్లు గందరగోళానికి గురిచేసే ప్రకటనలు ఇచ్చాడు, ఎన్నిసార్లు తప్పుడు స్టేట్ మెంట్స్ ఇచ్చాడనే లెక్క తీస్తే 8158గా తేలింది. వీటిలో 6000 ప్రకటనల్ని ఆయన 2018లోనే ఇవ్వడం గమనార్హం.

అంతే కాదు, ఇలా రోజుకో తప్పుడు ప్రకటన ఇవ్వడంలో ట్రంప్ తన రికార్డును తానే క్రాస్ చేసినట్టు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో ఆయన తప్పుడు ప్రకటనలు ఇచ్చే సగటు రోజుకు 5.9 కాగా.. ఇప్పుడది 16.5కు చేరింది. అంటే.. ఒక్కోసారి ఆయన రోజుకు 2-3 తప్పుడు స్టేట్ మెంట్స్ కూడా ఇస్తున్నాడన్నమాట. ప్రజల్ని గందరగోళానికి గురిచేసేలా, ట్రంప్ ఇచ్చిన తప్పుడు ప్రకటనల్లో ఎక్కువ శాతం ఇమ్మిగ్రేషన్ కు చెందినవే ఉన్నాయి.