Begin typing your search above and press return to search.
ట్రంప్ ట్వీట్స్ చూసి మీ ప్రయాణం డిసైడ్ చేసుకోండి
By: Tupaki Desk | 13 Dec 2017 10:18 AM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు వలస చట్టాలపై కన్నేశారు. కొద్దికాలం కిందట అమెరికాలో ఉద్యోగం చేసుకునే వారిపై కత్తిగట్టిన రీతిలో వ్యవహరించిన అగ్రరాజ్యాధిపతి తాజాగా వారి బంధువులపైనా...కన్నేశారు. అమెరికన్లకు పూర్తి స్థాయి భద్రత కల్పించేందుకు వీలుగా సంస్కరణ చట్టాలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దేశంలో స్థిరపడిన విదేశీయుల బంధువుల రాకపోకలపై ఆంక్షలు విధించే అంశాన్ని తమ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందన్నారు. న్యూయార్క్ నగరంలో మెట్రో స్టేషన్ సమీపంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందినవాడిగా అనుమానిస్తున్న బంగ్లాదేశ్ జాతీయుడు జరిపిన దాడి అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మీడియాలో ప్రసంగించారు. అకాయదుల్లా అనే ఈ 27ఏళ్ల దుండ గుడు జరిపిన దాడిలో నలుగురు వ్యక్తులు గాయపడిన విషయం తెలిసిందే.
న్యూయార్క్ నగరంలో ప్రజలను ఊచకోత కోసేందుకు ప్రయత్నించిన ఈ దాడి రెండు నెలల వ్యవధిలో న్యూయార్క్ నగరంలో జరిగిన రెండో ఉగ్రదాడి అని ట్రంప్ చెప్పారు. అమెరికన్ ప్రజలకు మరింత భద్రత కల్పించేందుకు వలస చట్టాలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని ఈ రెండు దాడులు గుర్తు చేస్తున్నాయన్నారు. `న్యూయార్క్ నగరంలో దాడికి పాల్పడిన వ్యక్తి బంగ్లాదేశ్ నుండి ఏడేళ్ల క్రితం కుటుంబ వీసాపై అమెరికాకు వచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా అమెరికా వలస విధానంలోని లొసుగులను అత్యవసరంగా తొలగించాల్సిన అవసరం ఉంది`ని ట్రంప్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు. పొడిగించిన కుటుంబ వలస విధానం ద్వారా ఈ అనుమానిత ఉగ్రవాది అమెరికాలో ప్రవేశించాడని, అందువల్ల ప్రస్తుతం కొనసాగుతున్న విధానం జాతీయ భద్రతకు ఏ మాత్రం అనువుగా లేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ విధానంలో దేశంలో స్థిరపడిన ఇతర దేశీయులు తమ బంధువులను అమెరికాకు రప్పిస్తున్నారని, ఈ విధానానికి అత్యవసరంగా తెరదించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏడు దేశాలకు చెందిన వ్యక్తుల అమెరికా ప్రవేశంపై నిషేధం విధించిన తన చర్యను ఆయన గట్టిగా సమర్ధించుకుంటూ దీనిని సుప్రీంకోర్టు అనుమతించటం వలస విధానాలను బలోపేతం చేసే దిశగా మరో ముందడుగు అని ట్రంప్ అభివర్ణించారు. వరుస వలసలకు తెరదించే దిశగా కాంగ్రెస్ తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. లోపభూయిష్టంగా వున్న ప్రస్తుత వలస విధానం వల్ల దేశ భద్రతకు - ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలికంగా చేటు జరుగుతోందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు. `మన దేశానికి - మన ప్రజలకు తొలి ప్రాధాన్యతనిస్తూ మన వలస విధానాలను పూర్తి స్థాయిలో సంస్కరించాలని నేను నిర్ణయించాను` అని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొనే వారికి చట్టం ద్వారా అత్యంత కఠినమైన శిక్షలు విధించాలని - అవసరమైన కేసుల్లో మరణ శిక్ష విధించినా తప్పులేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో అమెరికా ఎప్పుడూ ముందే ఉంటుందని, అమెరికా ప్రభుత్వ వ్యవస్థలు ఉగ్రవాద చర్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగానే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దేశానికి - ప్రజలకు మరింత భద్రత కల్పించే విధంగా వలస చట్టాలకు పూర్తి స్థాయి సంస్కరణలు తెచ్చేందుకు కాంగ్రెస్ - అధ్యక్షుడితో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని న్యూయార్క్ దాడి మరోసారి గుర్తు చేసిందని అభిప్రాయపడ్డారు.