Begin typing your search above and press return to search.
‘బాత్రూంల’పై ట్రంప్ వివాదాస్పద నిర్ణయం
By: Tupaki Desk | 24 Feb 2017 4:49 AM GMTవివాదాస్పద మాటలు.. చేష్టలతో తరచూ వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఎవరూఊహించని రీతిలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికన్లలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. లింగమార్పిడి చేసుకున్న విద్యార్థులు.. మహిళలు.. పురుషులు వాడే బాత్రూంలు వినియోగించే విషయం మీద ట్రంప్ కొత్త తరహా ఆదేశాల్ని జారీ చేశారు.
ట్రంప్ తాజా ఆదేశాలతో లింగమార్పిడి చేసుకున్న పురుషులు.. మహిళలు.. వారు పురుష.. మహిళల బాత్రూంలను వినియోగించకూడదు. దీనికి భిన్నమైన ఉత్తర్వుల్ని ఒబామా సర్కారు ఇచ్చింది. దీన్ని నిలిపివేసేలా ట్రంఫ్ తీసుకున్న నిర్ణయాన్ని డెమోక్రాటిక్ నేతలు.. హాలీవుడ్ నటులు పెద్ద ఎత్తున తప్పు పడుతున్నారు. ఇది సరైన చర్య కాదని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. బాత్రూంలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వర్గం గట్టిగా సమర్థించుకొంటోంది. గతంలో ఒబామా సర్కారు విడుదల చేసిన ఉత్తర్వులలో బోలెడు లోపాలు ఉన్నాయని.. పలువురు ఫిర్యాదులు చేశారని అందుకే.. తామీ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఒబామా ఉత్తర్వులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇప్పటికిప్పుడు లింగమార్పిడి విద్యార్థులకు వచ్చే నష్టమేమీ లేదని చెప్పటం గమనార్హం. మరీ.. ‘బాత్రూం’ నిర్ణయం ట్రంప్ సర్కారును ఏం చేస్తుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/