Begin typing your search above and press return to search.

ట్రంప్ పారిపోయి బంకర్ లో ఉన్నాడా??

By:  Tupaki Desk   |   1 Jun 2020 8:50 AM GMT
ట్రంప్ పారిపోయి బంకర్ లో ఉన్నాడా??
X
ప్రతిరోజూ వివాదాస్పద వ్యాఖ్యలతో విరుచుకుపడే అగ్రరాజ్యం అమెరికా అధినేత తోలిసారి నిరసనకారులకి బయపడి పారిపోయి రహ్యస్య బంకర్ లో వెళ్లారు అని తెలుస్తుంది. మినియాపొలిస్‌‌ లో జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే ఒక నల్లజాతి అమెరికన్‌ పౌరుడిని ఒక అమెరికన్‌ పోలీసు మోకాలితో గొంతుపై ఎనిమిది నిముషాలపాటు తొక్కి ఉంచి, ఊపిరి ఆడకుండా చేసి చంపేసిన ఘటన ఇప్పుడు అమెరికాను వణికించేస్తుంది.

ఈ హత్యకి నిరసనగా ఇంకా పెద్దఎత్తున నిరసనజ్వాలలు కొనసాగుతున్నాయి. ఏకంగా అధ్యక్షభవనం వైట్ హౌస్ వద్దే ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణలు పడుతున్నారు. ఈ నిరసనలు తీవ్ర ఉగ్రరూపం దాల్చడంతో అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అధినేత ట్రంప్ ను వైట్ హౌస్ కిందగల బంకర్ లోకి తీసుకువెళ్లారు. అక్కడే సుమారుగా గంట సేపు ఉన్నారని న్యూయార్క్ టైమ్ ఓ కథనాన్ని ప్రచురించింది.

నిరసనకారుల ఆందోళనలను ప్రత్యక్షంగా తన భవనంలో నుంచే చూసిన ట్రంప్.. కాస్త గాభరా పడినట్టు కనిపిస్తున్నారు. అందుకే బంకర్ లోకి వెళ్ళివచ్చినట్టు తెలుస్తుంది. నిరసనకారులను చూసిన ట్రంప్ టీమ్ లోని వారే ఆశ్చర్యపోయారట. కాగా-15 రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్స్ ని ప్రభుత్వం సిధ్ధం చేసింది. మరో రెండు వేల మంది పోలీసులను కూడా రంగంలోకి దించడానికి సమాయత్తమైంది. మాకు ఊపిరి ఆడటంలేదు, మీ చర్యలతో విసిగిపోయాం, జార్జ్ కు న్యాయం జరగాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేస్తున్నారు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరుకుని కార్లకి నిప్పు పెడుతున్నారు. అలాగే జార్జ్ వీడియో చూసి ఏడుపు ఆగట్లేదు అని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా విచారం వ్యక్తం చేసారు.