Begin typing your search above and press return to search.

ఇప్పటికీ కొనసాగుతున్న కిమ్, ట్రంప్ దోస్తానా.. నిజమెంత.?

By:  Tupaki Desk   |   13 Feb 2022 4:01 AM GMT
ఇప్పటికీ కొనసాగుతున్న కిమ్, ట్రంప్ దోస్తానా.. నిజమెంత.?
X
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన ప్రత్యేక పరిచయం అంటూ ఎవరికీ అక్కర్లేదు. ఎందుకంటే ఆయన చేసిన పనులు అటువంటివి. అధ్యక్షుడిగా తన చివరి రోజున కూడా ఆయన చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. తాను అనుకున్న పనులను, నిర్దిశించుకున్న వాటిని తనదైన శైలిలో చేయడం ట్రంప్ ప్రత్యేకత. అలాంటి వాటిని చేయడం లో ట్రంప్ ముందుంటారు. నచ్చిన విషయంలో ఎవరి మాట వినని సీతయ్య లాగా అనేక సందర్భాల్లో ఆయన వ్యవహరించిన తీరు ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది.

అయితే ఇలాంటి వ్యక్తికి సరైనోడు అని ముద్ర పడిన మరో నాయకుడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. వాస్తవానికి వీరికి పెద్ద తేడా ఉండదు. ఇద్దరూ ఇద్దరే. ఒక విషయంలో ఒకరికి ఒకరు తీసిపోరు. ఇంకా చెప్పాలంటే అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కన్నా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తీసుకునే నిర్ణయాలు అత్యంత కఠినంగా ఉంటాయని అంతర్జాతీయ మీడియా ఇప్పటికే చాలాసార్లు కోడై కూసింది. ఒకానొక సమయంలో అధ్యక్ష హోదాలో వీరిద్దరూ చర్చలకు గాను కలిశారు.

అయితే అవి అసంపూర్ణంగానే మిగిలిపోయాయి. వీరువుని మధ్య ఉన్న శత్రుత్వం అలాంటిది. ఒకరు అంటే ఒకరికి పడదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇలాంటి వారివురి మధ్య ఇంకా మంచి సంబంధాలు ఉన్నాయని... కిమ్ తో ట్రంప్ ఇంకా స్నేహపూరితంగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటి ఒకరినొకరు మంచి సంబంధాలు కలిగి ఉన్నారని ఓ రిపోర్టర్ తెలిపారు. తాను రాస్తున్న ఓ పుస్తకంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని మాజీ అధ్యక్షుడు ట్రంప్ నే స్వయంగా ఆయనకు చెప్పినట్లు న్యూయార్క్ టైం రిపోర్టర్ మాగీ హెబర్మన్ ఆ బుక్ లో రాసుకొచ్చారు. ఈ రిపోర్టర్ రాసిన పుస్తకం పేరు 'ది కాన్ఫిడెన్స్‌ మ్యాన్‌'.

ఇదిలా ఉంటే ఈ బుక్ లో ట్రంప్ చెప్పిన అంశాలను రాసినా కానీ వాటిలి నిజానిజాల విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో తనకు ఏ మాత్రం తెలియదని అన్నారు. ముఖ్యంగా ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిణామాలు ఉన్న సమయంలో ఈ విషయం తెర మీదకు వచ్చింది. వీరి మధ్య సంబంధాలు 2018 నుంచే ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ అంశంపై వైట్ హౌస్ వర్గాలు స్పందించలేదు. అలానే ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ కూడా నోరు మెదపలేదు. అమెరికాలోని చట్టాల ప్రకారం అగ్ర రాజ్య అనుమతి లేని ఇతర దేశాల ప్రభుత్వాలపై చర్చలు జరపడం లాంటివి చేయకూడదని ఉంది. అందుకే దీనిపై అమెరికా నుంచి ఎవరూ స్పందించలేదు.

ట్రంప్ ఇప్పటికీ కిమ్ కు టచ్ లో ఉన్నారనే దానిపై ఉత్తర కొరియాకు చెందిన ప్రాజెక్ట్ 38 డైరక్టర్ జెన్నీ టౌన్ మాట్లాడారు. అలా అని డైరెక్ట్ గా కిమ్ తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని అనడం తప్పని అన్నారు. ట్రంప్ లాంటి వ్యక్తికి పబ్లిసిటీ కావాలి. దీంతో ఎప్పుడోఒకప్పుడు గ్రీటింగ్స్ పంపి ఉండొచ్చని అన్నారు. అంతేగాకుండా అధికారులకు తెలియకుండా ట్రంప్ ఏం చేయలేదని... అలా చేస్తే అది అమెరికా పెద్ద దెబ్బ అవుతుందని అన్నారు.

గతంలో ట్రంప్, కిమ్ లు కలిసినప్పుడు చర్చించిన వివిధ అంశాలకు సంబంధించిన రికార్డులను ట్రంప్ తన వద్ద పెట్టుకోగా... అమెరికా ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంది. వాటిలో ఎక్కువగా శాంతిభద్రతలు, రక్షణ శాఖకు సంబంధించినవే ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.