Begin typing your search above and press return to search.
మహమ్మారికి దేశాన్ని మూసివేసే ప్రసక్తే లేదు: ట్రంప్
By: Tupaki Desk | 23 May 2020 4:45 AM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశంలో మహమ్మారి వైరస్ ఎంత విస్తరిస్తున్నా.. ప్రాణాలు తీస్తున్నా అదే మంకు వీడడం లేదు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా అస్సలు వెనక్కితగ్గడం లేదు.
మహమ్మారి ప్రబలడంతో అన్ని దేశాలు లాక్ డౌన్ విధించినా... అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఆ దేశంలో పెద్ద ఎత్తున కేసులు, మరణాలు సంభవిస్తున్నా కానీ దేశాన్ని మూసివేయడానికి ఆసక్తి చూపించడం లేదు. లాక్ డౌన్ పట్ల ట్రంప్ వ్యతిరేకంగా ఉన్నారు. కరోనా వైరస్ ఎంత విస్తరిస్తున్నా ఆయన తక్కువ చేసి చూశాడు. ఇక పరిస్థితి చేయిదాటడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ తో దేశాన్ని మూసివేయవలసి వచ్చింది.
తాజాగా అమెరికాలోని అన్ని రాష్ట్రాలు పరిస్థితిని బట్టి లాక్ డౌన్ ను ఉపసంహరించి తిరిగి తెరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాట్ కామెంట్స్ చేశారు. రెండోసారి మహమ్మారి దేశంలో ప్రబలినా కానీ తాను లాక్ డౌన్ విధించనని.. దేశాన్ని మూసివేయబోనని సంచలన కామెంట్స్ చేశారు.
అయితే ఇంట్లో ఉంటేనే సేఫ్ అని.. లాక్ డౌన్ తోనే ఇది సాధ్యమని.. ఆంక్షలు ముగిసిన తర్వాత రోడ్లపైకి జనాలు వస్తే రెండో దఫా, మూడో దఫా వైరస్ పెద్ద ఎత్తున ప్రబలుతుందని అమెరికా వైద్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. రెండో దఫా మహమ్మారి వ్యాపిస్తే మొదటి దానికంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలకు సోకుతుందని ప్రాణాలు తీస్తుందని హెచ్చరిస్తున్నారు. వచ్చే శీతాకాలం ఊహకందని రీతిలో వైరస్ వ్యాప్తి అమెరికాలో ఉంటుందని..ఆ ఫ్లూ సీజన్లో వైరస్ తో పోరాడడం కష్టమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం న్యూయార్క్ సహా పలు బాగా ప్రభావితం అయిన అన్ని రాష్ట్రాలు తిరిగి లాక్ డౌన్ ఎత్తివేసి తెరుస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నా కూడా తెరుస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే మిచిగాన్ లోని ఫోర్డ్ ఫ్యాక్టరీలో పర్యటించిన ట్రంప్ తన దేశాన్ని ఎంత వైరస్ విస్తరించినా మూసివేయనని.. లాక్ డౌన్ విధించనని స్పష్టం చేశారు. దీంతో అమెరికా ఇంకా ఎన్ని మరణాలు, కేసులు చవిచూస్తుందోనన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది.
ఇప్పటికే అమెరికాలో 1.61 మిలియన్లకు పైగా కేసులు నమోదయ్యాయి. 96వేల మంది మరణించారు. 310000 మంది ప్రజలు కోలుకున్నారు.