Begin typing your search above and press return to search.

అమెరికా సీరియస్‌ ఇన్వెస్టిగేషన్ ..పరిహారం ఎంతో త్వరలోనే ప్రకటిస్తాం

By:  Tupaki Desk   |   28 April 2020 8:00 PM IST
అమెరికా సీరియస్‌ ఇన్వెస్టిగేషన్ ..పరిహారం ఎంతో త్వరలోనే ప్రకటిస్తాం
X
చైనాలోని వుహాన్ ‌లో సిటీలో వెలుగులోకి వచ్చిన ఈ కరోనా మహమ్మారితో సంభవించిన నష్టాలకు పరిహారం కోరే విషయమై అన్ని రకాలుగా సిద్ధమవుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. వైరస్‌ పుట్టికొచ్చిన తొలినాళ్లలో చైనా పారదర్శకంగా వ్యవహరించలేదని ఆరోపించారు. డ్రాగన్‌ దేశం విధానాలు సరిగా లేవని వైట్‌ హౌజ్ ‌లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ ప్రకటించారు. వైరస్‌ బయటిపడిన చోటునుంచే త్వరితగత నిర్ణయాలతో అదుపు చేస్తే.. పరిస్థితులు ఇంత దారుణంగా తయారయ్యేవి కావని, ప్రపంచం మొత్తానికి కరోనా వ్యాప్తి జరగక పోయేదని కాదని అయన అన్నారు.

కాగా, చైనా కారణంగా తమ దేశం ఆర్థికంగా నష్టపోయిందని చెప్తూ.. 165 బిలియన్‌ డాలర్లు నష్టపరిహారం కోరేందుకు జర్మనీ సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే, జర్మనీ కంటే భారీ మొత్తాన్ని చైనా నుంచి పరిహారం కోరతామని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. చైనా దేశ నాయకులను బాధ్యులుగా చేసేందుకు ఎన్నో మార్గాలున్నాయని తెలిపారు. దానికోసం ‘అమెరికా సీరియస్‌ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది‌’ అని తెలిపారు.

‘మేం జర్మనీ కంటే ఇంకా సులభ మార్గాన్ని ఎంచుకుంటాం. కోవిడ్‌తో చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనమయ్యాయి. అందుకే భారీ మొత్తాన్ని రాబట్టే దిశగా ముందుకెళతాం. ఎంత మొత్తం అని ఇప్పుడే చెప్పలేం. భారీ స్థాయిలోనే ఉంటుంది ’అని ట్రంప్‌ చెప్పారు. గత డిసెంబర్‌లో వుహాన్‌ లో పుట్టుకొచ్చిన ప్రాణాంతక కరోనా తో ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల మంది బాధితులుగా మారగా.. 2 లక్షల మందికి పైగా ప్రాణాలు విడిచారు. అమెరికాలోనే 55 వేలకి పైగా మరణాలు సంభవించాయి. ప్రపంచంలో చాలా దేశాలు లాక్‌ డౌన్ ‌తో ఆర్థికంగా కుదేలయ్యాయి. .