Begin typing your search above and press return to search.

భారత్ ఉలిక్కిపడేలా వ్యాఖ్యలు చేసిన ట్రంప్

By:  Tupaki Desk   |   4 Jan 2020 11:44 AM GMT
భారత్ ఉలిక్కిపడేలా వ్యాఖ్యలు చేసిన ట్రంప్
X
ఒక దేశానికి చెందిన రక్షణ దళాల చీఫ్ ను మరో దేశం ఏసేయటం ఒక సంచలనం అయితే.. అది కూడా సదరు చీఫ్ విదేశీ పర్యటనలో ఉండగా చోటు చేసుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మధ్య ప్రాచ్యం మీద యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేయటమే కాదు.. మూడో ప్రపంచ యుద్ధానికి తెర తీసేలా ట్రంప్ వ్యవహరించారా? అన్న సందేహం కలిగేలా తాజా దాడి ఉందని చెప్పాలి.

అవును.. ఇప్పుడు చెబుతున్నదంతా ఇరాన్ రక్షణ దళాల చీఫ్ ఖాసిం సలేమానీని డ్రోన్ల సాయంతో హతమార్చటం గురించే. అగ్రరాజ్యం అమెరికా చర్యతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడేలా చేసిందని చెప్పాలి. సులేమానీ హతమార్చిన వైనంపై ఇరాన్ ఎంతగా రగిలిపోతుందో తెలిసిందే. అమెరికా చర్యను వివిధ దేశాలు తప్పు పట్టాయి కూడా. అయితే.. తాను చేసిన పనిని సమర్థించుకున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.

సులేమానీ మరణంతో ఇప్పటివరకూ వివిధ దేశాల్లో చోటు చేసుకున్న బీభత్సానికి తెర పడినట్లుగా పేర్కొన్నారు. లెబనాన్ మొదలు సదూర తీరాన ఉన్న ఢిల్లీలో చోటు చేసుకున్న తీవ్రవాద కార్యక్రమాల వెనుక సులేమానీ హస్తం ఉందన్నారు. అమాయకుల్ని పొట్టన పెట్టుకోవటం సులేమానీకి అలవాటు అని ట్రంప్ పేర్కొన్నారు. వివిధ దేశాల్లో చోటు చేసుకున్న ఉగ్ర దాడుల్లో అతడి పాత్ర ఉందన్నారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలు భారత్ ఉలిక్కి పడేలా చేస్తాయనటంలో సందేహం లేదు. ఎందుకంటే.. సులేమానీని అమెరికా హతమార్చటం భారత్ సైతం పాజిటివ్ గా రియాక్ట్ కాలేదు. ఇలాంటి వేళ.. దేశ రాజధాని ఢిల్లీ మీద దాడి జరిపిన ఉగ్రవాదుల వెనుక సులేమానీ హస్తం ఉందన్న మాటను చెప్పటం ద్వారా.. భారత్ రియాక్ట్ కాకుండా ట్రంప్ చేశారని చెబుతున్నారు.