Begin typing your search above and press return to search.
కరోనా పోరులో వైద్యులు, నర్సులు మృతి ... అందంగా ఉందన్న ట్రంప్ !
By: Tupaki Desk | 15 May 2020 12:30 PM GMTట్రంప్ ..నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో స్నేహం చేస్తుంటాడు. ప్రతి రోజు ఎదో ఒక వివాదాస్పద కామెంట్ చేయకుండా ట్రంప్ రోజు ముగియదు అంటే అతిశయోక్తి కాదు. అసలు దీనిపై ఎప్పుడు ,ఎలా మాట్లాడాలి అనే జ్ఞానం కూడా లేకుండా ..ఇష్టారీతిన మాట్లాడుతుంటారు. ఈ తరుణంలోనే తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తనకి నోటి దురుసు కొంచెం కాదు కావాల్సిన కాడికి ఉందని నిరూపించుకున్నాడు. కరోనా పోరులో ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడుతున్న వైద్యులు, నర్సులను ఉద్దేశించిన ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చాయి.
పీపీఈ కిట్స్ కొరతపై జరిగిన సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. యుద్ధంలో పోరాడుతూ బుల్లెట్ల తాకిడికి నేలకొరిగిన సైనికులలాగా మహమ్మారి పై పోరు జరుపుతున్న వైద్యులు, నర్సులు మరణిస్తున్నారు. ఇది చూడటానికి చాలా అందంగా ఉందని ట్రంప్ చెప్పారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత అందంగా ఉంటే ఆయననే చేయమనండి అంటూ మండిపడుతున్నారు. ఎక్కడైనా మరణించడం అందంగా ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు.
అలాగే, ట్రంప్ వ్యాఖ్యలపై వైద్యులు, నర్సులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక నర్సుగా చెబుతున్నా.. ఇది చూడటానికి అందంగా లేదు అని చురకలంటించారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, నర్సులపై ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని మండిపడుతున్నారు. అయితే , వైరస్ బాధితులు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. మహమ్మారి వారికీ వైద్యం అందిస్తున్న వైద్యులకు, నర్సులకు మాత్రం తగినన్నీ పీపీఈ కిట్స్ లేకపోవడం గమనార్హం. దీనితో చాలామంది వైద్యులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. తమ ప్రాణాలు పోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురు నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఇప్పటి వరకు 1.45 మిలియన్ల మంది కరోనా బారినపడ్డారు. వీరిలో రెండున్నర లక్షల మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 86,571 మంది ఇప్పటి వరకు మరణించారు.