Begin typing your search above and press return to search.
టెస్టులు చేస్తే ఇండియా అమెరికాను దాటేస్తుంది : ట్రంప్
By: Tupaki Desk | 6 Jun 2020 2:00 PM GMTప్రపంచాన్ని అల్లకల్లోల్లం చేస్తున్న మహమ్మారి పై ట్రంప్ మరోసారి తనదైన రీతిలో స్పందించారు. ప్రస్తుతం ఈ మహమ్మారి పాజిటివ్ కేసులు అమెరికాలోనే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అయితే, భారత్ , చైనాలో ఈ వైరస్ నిర్దారణ పరీక్షలు పెంచితే ఆ దేశాల్లోనే ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతాయని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. మెయిన్ నగరంలో ఓ మెడికల్ ప్రోడక్ట్స్ కంపెనీని సందర్శించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికాలో ఇప్పటి వరకు 2 కోట్ల మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు.
అమెరికాతో పోలుస్తూ.. జర్మనీ 4మిలియన్లు, దక్షిణకొరియా 3మిలియన్లు టెస్టులు నిర్వహించాయి. జాన్సా హాప్ కిన్స్ వైరస్ రిసోర్స్ సెంటర్ లెక్కల ప్రకారం.. అమెరికాలో 1.9మిలియన్ కేసులు నమోదుకాగా, లక్షా 9వేల మంది చనిపోయారు. అమెరికాలో వైరస్ కేసులు నమోదై అత్యంత దారుణంగా తయారైందని వస్తున్న కామెంట్లపై ఒకవేళ టెస్టులు నిర్వహిస్తే ఇండియాలో ఉన్న 2లక్షాల 36వేల 184కేసులు, చైనా 84వేల 177కేసులకు మించి నమోదవుతాయని అన్నారు.
ఈ క్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. మా దేశంలో 2 కోట్ల మందికి టెస్టులు చేశాం. ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. టెస్టులు ఎక్కువ చేస్తే.. కేసులు పెరుగుతాయి. నా దేశ ప్రజలకు కూడా ఇదే చెప్పాను. ఒక వేళ మీరు గనక ఇండియా, చైనా వంటి ఇతర దేశాల్లో టెస్టులు విస్తృతంగా చేస్తే.. అక్కడ ఎక్కువ సంఖ్యలో కేసులు బయటపడతాయి అని నేను హామీ ఇస్తున్నాను అన్నారు. ఇప్పటివరకు కేవలం ఇండియాలో ఇప్పటివరకూ 4మిలియన్ కరోనావైరస్ టెస్టులు మాత్రమే నిర్వహించారు అని అన్నారు.