Begin typing your search above and press return to search.

అంతకంతకు అమెరికా ప్రతీకారం తీర్చుకుంటుంది..చైనాకి వార్నింగ్ ఇచ్చిన ట్రంప్!

By:  Tupaki Desk   |   15 April 2020 12:30 PM GMT
అంతకంతకు అమెరికా ప్రతీకారం తీర్చుకుంటుంది..చైనాకి వార్నింగ్ ఇచ్చిన ట్రంప్!
X
కరోనా మహమ్మారి గురించి అసలు నిజాలు ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టిన చైనా అంతకంతకు అనుభవిస్తుంది అని ట్రంప్ వ్యాఖ్యానించారు. . గతేడాది చైనాలోని వూహాన్ లో వెలుగులోకి వచ్చిన ఈ కరోనా వైరస్, ఆతరువాత మొత్తం ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షలమందికి సోకగా .. 127,635 మంది చనిపోయారు. ముఖ్యంగా ఈ కరోనా దెబ్బకి అమెరికా వణికిపోయింది. దీనితో వైట్ హౌజ్ లో జరిగిన మీడియా సమావేశంలో రిపోర్టర్ పై ట్రంప్ ఫైర్ అయ్యారు.

'చైనాపై ఎటువంటి చర్యలు తీసుకోరా అని అడిగిన దానికి ఎవరు చెప్పారు ఎటువంటి చర్యలు తీసుకోమని అంటూ ట్రంప్ ఫైర్ అయ్యారు. అవేం నేను చెప్పను. చైనా తప్పకుండా తెలుసుకుంటుంది. నేనెందుకు చెప్పాలి. వారు ఇచ్చిన తప్పుడు సమాచారానికి తప్పక అనుభవించాలి' అని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేమేం చేస్తున్నామో మీకు తెలియాలా, ఓ పేపర్ మీద మా ప్లాన్ ఏంటో రాసి ఏం చేయాలను కుంటున్నామో మీకు చెప్పాల్సిన పని మాకు లేదు అని అన్నారు.

అమెరికాను కాపాడుకోవడంలో మా టీంతో పాటు నాకూ, ఓ ప్లానింగ్ ఉంది. అగ్రస్థాయి నిపుణులతో ప్లాన్ ప్రకారమే నడుచుకుంటున్నాం. అనుకున్న సమయానికే పనులు పూర్తి చేస్తున్నాం. అదే చాలా ముఖ్యం కూడా అని మీడియా సమావేశంలో తెలియజేశారు ట్రంప్. సెనేటర్ స్టీవ్ డైనిస్ ట్రంప్ కు లెటర్ ద్వారా ప్రశ్నించారు. చైనా నుంచి మెడికల్ సప్లై, పరికరాలను మళ్లీ తీసుకురావాలని.. డ్రగ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఉద్యోగాలు పునరుద్ధరించాలని కోరారు.