Begin typing your search above and press return to search.
భారత ఐటీ కంపెనీల కు ట్రంప్ షాక్
By: Tupaki Desk | 12 Nov 2019 10:44 AM GMTఅమెరికా నే ఫస్ట్.. ఆ తర్వాతే ఎవరైనా అనే నినాదం తోనే అధికారం లోకి వచ్చారు ట్రంప్. అమెరికన్లకు మొదట ఉద్యోగాలు కల్పించాకే విదేశీయుల కు అనే పాలసీ ని కఠినం గా అమలు చేస్తున్నారు. విదేశీ ఉద్యోగ నిపుణుల కు ఇచ్చే హెచ్1బీ వీసాలను కఠినతరం చేస్తున్నారు. ఈ త్రైమాసికం లో హెచ్1 బీ వీసాల తిరస్కరణ రేటు అమెరికా లో 24శాతానికి చేరుకుంది. మొత్తం గా ఈ ఏడాది 40శాతానికి తిరస్కరణ రేటు పెరగింది. దీంతో భారత ఐటీ నిపుణులు అమెరికా లో అడుగు పెట్టని పరిస్థితులు ఎదురవుతున్నాయి.
తాజాగా భారత ఐటీ సంస్థలకు ట్రంప్ సర్కారు మరో షాకిచ్చింది. ఏడు భారత ఐటీ సంస్థలు హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకోకుండా అమెరికా సర్కారు నిషేధం విధించింది. భారత ఐటీ సంస్థలైన నెటేజ్, కెవిన్ చాంబర్స్, ఈఎస్ ఫైర్ ైటీ ఎల్ఎల్ సీ, బిజెనెస్ రిపోర్టింగ్ మేనేజ్ మెంట్, బుల్ మెన్ కన్సల్టెంట్, అజిమెట్రి లు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లేదంటూ బ్యాన్ చేసింది.
ట్రంప్ సర్కారు నిర్ణయం తో అమెరికాలో ఉన్న దిగ్గజ ఐటీ కంపెనీ లు షాక్ తిన్నాయి. అమెరికా వీసాల తిరస్కరణ తో పాటు ఇప్పుడు మొత్తమే నిషేధం విధించడం తో తల పట్టుకుంటున్నాయి. ఇప్పుడు భారతీయుల స్థానం లో అమెరికన్ల నే ఉద్యోగాల్లో భర్తీ చేయాల్సిన పరిస్థితి భారత ఐటీ కంపెనీల కు ఏర్పడింది.
ప్రస్తుతం భారత ఐటీ కంపెనీల ద్వారా నే అమెరికా చాలా ఆదాయం పొందుతోంది. ఏకంగా 58 బిలియన్ డాలర్లను భారత ఐటీ కంపెనీలు అమెరికా జీడీపీ కి పన్ను రూపం లో చెల్లిస్తున్నాయి. ట్రంప్ సర్కారు నిర్ణయం తో భారత ఐటీ కంపెనీలు తమ కంపెనీలను ఇండియా కు తరలించే అవకాశాల ను కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం.