Begin typing your search above and press return to search.

ఇంటా - బ‌య‌ట‌...ట్రంప్‌ కు ఇదో సంబరం!

By:  Tupaki Desk   |   22 Jun 2020 3:30 PM GMT
ఇంటా - బ‌య‌ట‌...ట్రంప్‌ కు ఇదో సంబరం!
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి దురుసు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం ఆ దేశంలో ఎన్నిక‌ల ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ స‌మ‌యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ప్రత్యర్థి జో బిడెన్‌పై విరుచుకుప‌డుతున్నారు. అంతేకాకుండా అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తి అంశాన్ని ఆయ‌న కెలుక్కుంటున్నారు. ఎన్నికల ప్రచారం, జనాదరణలో బిడెన్‌ కంటే ట్రంప్‌ కాస్త వెనుకబడ్డారు. ఈ నేప‌థ్యంలో ఓక్లాహోమాలో ఎన్నికల ర్యాలీ సందర్భంగా ఆయన వివాదాస్ప‌ద‌ వ్యాఖ్యలు చేశారు.
కరోనా వైరస్‌ విషయంలో ఇప్పటికే చైనాపై తీవ్ర ఆరోపణలు చేసిన ట్రంప్ తాజాగా చైనాను ఉద్దేశిస్తూ కరోనా వైరస్‌కు కుంగ్ ఫ్లూ అనే పేరు పెట్టారు. దీనిపై చైనా భ‌గ్గుమంటోంది.

కుంగ్ ఫూ అనే మార్షల్ ఆర్ట్స్ చైనాలో ఎంతో ప్రత్యేకమైందన్న విషయం తెలిసిందే. ఈ పేరు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చేలా, క‌రోనా వైరస్‌కు కుంగ్ ఫ్లూ అనే పేరు పెట్టిన ట్రంప్ అంతేకాకుండా కోవిడ్‌కు 20 రకాల కొత్త పేర్లు పెట్టామని, దానిని వూహాన్‌ వైరస్‌ అంటూ నామకరణం చేసింది కూడా తామేనంటూ రెచ్చగొట్టే రీతిలో ప్రకటనలు చేశారు. అలా ట్రంప్ కెల‌క‌డంతో..చైనా ఘాటుగా స్పందించింది. ఆ దేశ విదేశాంగ శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసి చైనాపై లేనిపోని విమర్శలు చేసి అధ్యక్ష ఎన్నికల్లో లబ్ధి పొందాలని ట్రంప్‌ భావిస్తున్నారంటూ మండిపడింది. త‌న కామెంట్లను ట్రంప్‌ వెనక్కి తీసుకోవాలని లేకపోతే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని హెచ్చరించింది. ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన కరోనా వైరస్‌ను తమ కుట్రగా అమెరికా భావించడం సరైనది కాదంటూ పేర్కొంది.

ఇదిలాఉండ‌గా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ప్రత్యర్థి జో బిడెన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన ఛాందస వామపక్షాల చేతిలో ఒక ‘నిస్సహాయ కీలుబొమ్మ’ అని అభివర్ణించారు. బిడెన్‌ మద్దతుదారులు నేరస్తులకు సాయం చేసి, వారిని బెయిల్‌ మీద బయటకు తీసుకువస్తున్నారని ఆరోపించారు. మొత్తంగా ట్రంప్ చేస్తున్న కామెంట్లు ఇంటా బ‌య‌ట వివాదాన్ని రాజేస్తున్నాయి.