Begin typing your search above and press return to search.
ట్రంప్ సరికొత్త నిర్ణయంతో షాక్ లో భారత్ , చైనా !
By: Tupaki Desk | 20 May 2020 4:30 PM GMTఈ మహమ్మారి పుట్టుక, వ్యాప్తిపై దర్యాప్తు పేరుతో చైనా ను కట్టడి చేస్తోన్న అమెరికా.. ఫార్మా రంగానికి సంబంధించి భారత్ కు కూడా భారీ షాక్ తగిలేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై దేశానికి అవసరమైన అన్ని రకాల మందుల తయారీ సొంతగడ్డపైనే చేపట్టాలన్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, దీనికోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. అమెరికా వాడుతోన్న మెడిసిన్స్ తయారీలో 80 శాతం ముడిసరుకు భారత్, చైనా నుంచి దిగుమతి అవుతుండగా, ఇప్పుడా కంపెనీలను సైతం సొంత దేశానికి తరలించాలని, తద్వరా సరికొత్త సప్లై చైన్ ను క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ మహమ్మారి దెబ్బకు అన్ని దేశాల ఆరోగ్య వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చైన్ తీవ్రంగా ప్రభావితమైంది. దీంతో అగ్రరాజ్యమైన అమెరికా చివరికి మందుల కోసం ఇతర దేశాలను బెదిరించే స్థాయికి దిగజారాల్సి వచ్చింది. దీన్ని పాఠాలు నేర్చుకున్న అగ్రరాజ్యం..దేశీ మార్కెట్లను వృద్ధి చేసుకునే పనిపై ఫోకస్ పెంచాయి. భారత ప్రధాని మోదీ వోకల్ ఫర్ లోకల్ నినాదమిస్తే..అమెరికాలో ట్రంప్ ఆ పనిని ఇప్పటికే మొదలుపెట్టేశారు.
స్థానికంగా ఔషధాల ఉత్పత్తి ప్రోత్సహించే క్రమంలో లోకల్ కంపెనీలకు భారీగా ఆర్డర్లు ఇస్తూ డాలర్లను పంపింగ్ చేస్తున్నారు ట్రంప్. డ్రగ్స్ తయారీ, సప్లైకి సంబందించి హెల్త్ అండ్ హ్యూమన్ సర్సీసెస్ శాఖలో కీలక విభాగమైన బయోమెడికల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ అథారిటీ సిఫార్సు మేరకు ట్రంప్ సర్కారు.. వర్గీనియాకు చెందిన ఫ్లౌకార్ప్ అనే బయో టెక్ కంపెనీకి 345 మిలియన్ డాలర్ల కాంట్రాక్టు కేటాయించింది. రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలకు ఆర్డర్లు, రాయితీలు ప్రకటిస్తామని అధికారులు చెబుతున్నారు.
అయితే, చైనా, భారత్ ప్రేమయంలేని సరికొత్త సప్లై చైన్ రూపొందించాలని ట్రంప్ చేస్తోన్న ప్రయత్నాలను ఎటువైపునకు దారితీస్తాయో, అమెరికా సర్కారు నిర్ణయాలు భారత్, చైనాపై ఏమేరకు ప్రభావం చూపుతాయో మరి. అమెరికాలో ఇప్పటిదాకా 1.26కోట్ల మందికి కరోనా టెస్టులు చేశారు. గడిచిన 24 గంటల్లోనే అక్కడ కొత్తగా 20,260 కేసులు, 1574 మరణాలు చోటుచేసుకోవడం గమనార్హం.