Begin typing your search above and press return to search.

అమెరికా సంచలన నిర్ణయం .. నూతన విదేశీ విద్యార్థులకు అనుమతి నిరాకరణ !

By:  Tupaki Desk   |   25 July 2020 10:10 AM GMT
అమెరికా సంచలన నిర్ణయం .. నూతన విదేశీ విద్యార్థులకు అనుమతి నిరాకరణ !
X
అమెరికాలో రోజురోజుకి కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ కారణంగా అంత్యంత ఎక్కువగా ప్రభావితం అయిన దేశం అగ్రరాజ్యం అమెరికానే. అమెరికాలో ఇప్పటివరకు 42 లక్షల మందికి పైగా కరోనా భారిన పడ్డారు.అలాగే దాదాపుగా లక్షా 50 వేల మందివరకు మరణించారు. దేశంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అమెరికా అధినేత ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఒకానొక సమయంలో అమెరికాలో ఉన్నత విద్యకై వెళ్లి, కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ మాధ్యమంగా తరగతులకు హాజరయ్యేవారు తప్పనిసరిగా దేశాన్ని వీడి వెళ్లాల్సిందేనని అమెరికా సంచలన ఆదేశాలు కూడా జారీ చేసింది. దీనిపై విమర్శలు రావడం తో దీన్ని తాజాగా మళ్లీ వెనక్కి తీసుకుంది.

అమెరికాలో ఆన్ లైన్ క్లాసులకి తమను అనుమతించాలని కోరే కొత్త విదేశీ విద్యార్థులకు పర్మిషన్ ని ట్రంప్ ప్రభుత్వం నిరాకరించింది. ఇప్పటికే దేశంలో ఉంటున్న విదేశీ విద్యార్థులకు మాత్రం అనుమతి ని ఇచ్చినట్టే. వీరి విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులను ఇమ్మిగ్రేషన్ విభాగం సవరించింది. ఈ కరోనా వైరస్ సమయంలో విదేశీ విద్యార్థులకు వీసాలను నిలిపివేస్తూ ట్రంప్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యంగా విదేశీ విద్యార్థులకు ఆన్ లైన్ తరగతుల నిషేధాన్ని సవాలు చేస్తూ హార్వర్డ్ యూనివర్సిటీతో సహా పలు విద్యా సంస్థలు కోర్టుకెక్కాయి. దీంతో ఈ నెల 14 న ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కేవలం కొత్త విదేశీ విద్యార్థులకు ,మాత్రమే అనుమతిని నిరాకరించింది.