Begin typing your search above and press return to search.
ట్రంప్ కొత్త సోషల్ మీడియా.. ఫేస్ బుక్, ట్విట్టర్ కు చుక్కలే.!
By: Tupaki Desk | 22 Feb 2022 7:32 AM GMTఅమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినంత పని చేశారు. కొత్త గా తాను రూపొందించిన కొత్త సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను ఆవిష్కరించారు. అత్యంత వివాదాస్పద రాజకీయ నాయకుడిగానే కాకుండా, వివాదాస్పద అధ్యక్షుడిగా కూడా పేరు తెచ్చుకున్న ఈ నేతకు పదవి నుంచి తప్పుకున్న సమయంలో సోషల్ మీడియా సరిగా సపోర్ట్ చేయలేదు. అందుకే వాటిపై ప్రతీకారం తో రగిలిపోతున్న ట్రంప్ నాడు చెప్పినట్లుగానే తన సొంత సోషల్ మీడియా ను మొదలు పెట్టాడు.
ట్రూత్ సోషల్ పేరుతో సోషల్ మీడియా యాప్ ను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విడుదల చేశారు. అయితే ఈ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ తన అభిమానులను కలుసుకోవడానికి రూపొందించినట్లు చెప్తున్నారు. అంతేగాకుండా ప్రస్తుతం ఉన్న సామాజిక మాధ్యమాలకు చెక్ పెట్టేలా కూడా దీన్ని రూపొందించారు ట్రంప్. ఇప్పటికే అమెరికా లో తిరుగు లేని వ్యాపార దిగ్గజం గా ఉన్న ట్రంప్... సోషల్ మీడియాలో కూడా దూసుకు పోయేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాద్యమాలతో పోటీగా ఈ ట్రూత్ సోషల్ ను తీసుకుని వచ్చారు ట్రంప్.
ప్రస్తుతం ట్రంప్ కొత్తగా తీసుకుని వస్తున్న ఈ సామాజిక మాధ్యమం కోసం భారీ స్థాయిలో ఖర్చు చేశారు. ట్రంప్ కొత్త ఫ్లాట్ ఫాం ను తీసుకుని రావడం వెనుక చాలా పెద్ద కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి పాలయ్యారు. ఇది తెలిసిన అతని అతని అభిమానులు గుంపులు గుంపులు గా క్యాపిటల్ భవనం వద్దకు చేరిన రచ్చ రచ్చ చేశారు. దానికి మద్దతుగా ట్రంప్ తన అభిమానులకు పిలుపు ఇవ్వడానికి సోషల్ మీడియా ను ఉపయోగించుకున్నారు.
ట్రంప్ సోషల్ మీడియా ను ఉపయోగించి ప్రజల్లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టు తున్నారు అని అప్పటికి ఉన్న సోషల్ మీడియా ఫేస్ బుక్, ట్విట్టర్ లు ఆయన పోస్ట్ లు నిలిపి వేసి అకౌంట్ ను బ్లాక్ చేశాయి. నియమాలు అతిక్రమించారని అందుకు కారణం చూపించాయి. అయితే ఇందుకు గానూ ట్రంప్ వారికి సరైన గుణపాఠం చెప్పాలని భావించారు. అందుకే తన గొంతు నొక్కేసిన వారికి ధీటుగా కొత్త సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను తీసుకొని వస్తానని ఆ రోజే చెప్పారు. ఇప్పుడు నాడు చెప్పిన విధంగా ట్రూత్ సోషల్ పేరుతో సామాజిక మాధ్యమాన్ని తీసుకుని వచ్చారు.
ట్రంప్ తీసుకుని వచ్చిన ఈ ట్రూత్ సోషల్... 2022 ఫిబ్రవరి 20 నుంచి యాపిల్ ప్లే స్టోర్ లలో అందుబాటులోకి వచ్చేసింది. అంతేగాకుండా వచ్చే నెల నుంచి దీనిని అన్ని మొబైల్ ఫార్మాట్ లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే మార్క్ జూకర్ బర్గ్ కు చెందిన ఫేస్బుక్, ఇన్ స్టాగ్రమ్, వాట్సాప్ లు అగ్రస్థానంలో ఉన్నాయి. వీటికి తోడు ట్విట్టర్ కూడా ఉంది అయితే... వాటిని అన్నింటినీ కాదని ట్రంప్ తీసుకు వచ్చిన సామాజిక మాధ్యమం ప్రజలకు ఏ రకంగా చేరువ అవుతుందో చూడాలి.