Begin typing your search above and press return to search.
ట్రంప్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది
By: Tupaki Desk | 10 July 2017 6:01 AM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటేనే చిత్రవిచిత్రమైన కామెంట్లకు, వివాదాస్పదమైన నిర్ణయాలకు పెట్టింది పేరు. ట్రంప్ అంటేనే ఓ కంపు అనే స్థాయిలో ముద్రపడిపోయింది. మరోవైపు ట్రంప్ విదేశీ పర్యటనల సమయంలో అక్కడి నిర్ణయాల కంటే ఆ సమయంలో ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులే హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. ఇటీవల పోలాండ్ ప్రథమ మహిళకు ట్రంప్ షేక్‌హ్యాండ్ ఇవ్వబోతుండగా..ఆమె మాత్రం అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా వైపు వెళ్లడం మీడియాకు సంచలనంగా మారింది. అయితే తాజాగా ట్రంప్ వ్యవహారశైలి ఆయన ఇమేజ్ ను పెంచిందని అంటున్నారు.
జర్మనీలో జరిగిన జీ-20 సమావేశానికి హాజరయిన ట్రంప్ ఈ సమావేశం పూర్తయ్యాక అమెరికా బయలుదేరేముందు విమానం వద్ద నిలబడి ఉన్న మెరైన్ గార్డులకు అభివాదం చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో గాలి ఎక్కువగా వీస్తుండడంతో అక్కడే ఉన్న ఓ గార్డు టోపీ ఎగిరిపోయింది. దాంతో ట్రంప్ అప్రమత్తమై టోపీ పట్టుకుని స్వయంగా తానే గార్డ్‌కి టోపీ పెట్టాడు. గాలికి మళ్లీ టోపీ ఎగిరి కాస్త దూరంలో పడిపోయింది. ఈసారి ట్రంప్ టోపీ తీసుకురావడానికి వెళుతుండగా మరో గార్డ్ ట్రంప్ కి సాయం చేశాడు. ఈ దృశ్యం కాస్తా అక్కడి మీడియా వర్గాలకు చిక్కడం, సోషల్ మీడియాలో వైరల్ అవడం చకచకా జరిగిపోయాయి. ట్రంప్‌లోనూ ఉన్నతమైన వ్యక్తిత్వం ఉందని పలువురు స్పందించారు.