Begin typing your search above and press return to search.
ట్రంప్ గుడ్ న్యూస్..టాప్ పదవుల్లో మనోళ్లకు చాన్స్
By: Tupaki Desk | 17 Jan 2019 12:57 PM GMTవీసాల నిబంధనల రూపంలో భారతీయులకు షాక్ ఇస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సర్కారు పదవుల విషయంలో భారతీయులకు తగు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటివరకు మూడు డజన్లకు పైగా భారత సంతతి వ్యక్తులను ట్రంప్ ప్రభుత్వ పదవుల్లో నియమించారు. ఈ ఒరవడికి కొనసాగింపుగా తాజాగా ముగ్గురు భారత సంతతి వ్యక్తులను కీలక పదవుల్లో నియమించారు. ఆ సమాచారాన్ని కాంగ్రెస్ కు పంపించారు.
ఆర్థికశాఖ అసిస్టెంట్ సెక్రెటరీగా బిమల్ పటేల్ ను - ఇంధనశాఖ అణుశక్తి విభాగం అసిస్టెంట్ సెక్రెటరీగా రీటా బరన్ వాల్ ను - పౌరహక్కుల బోర్డు సభ్యునిగా ఆదిత్య బంజాయ్ ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. ఈ నామినేషన్లను కాంగ్రెస్ ఆమోదం కోసం పంపించారు. వీరి నియామకాల గురించి ట్రంప్ ఇదివరకే ప్రకటించినప్పటికీ బుధవారం కాంగ్రెస్ కు అధికారికంగా ప్రతిపాదనలు సమర్పించారు. ఇదిలాఉండగా - భారతీయులను తన సర్కారులో ఉన్నత పదవులు కల్పించగా పలువురు ట్రంప్ పాలనలో పదవులు వీడిన సంగతి తెలిసిందే. ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా క్యాబినెట్ ర్యాంకుతో పనిచేసిన నిక్కీ హేలీ ఇటీవలే రాజీనామా చేశారు. అమెరికా ఉప పత్రికాకార్యదర్శిగా పనిచేసిన రాజ్ షా కూడా తన పదవి నుంచి తప్పుకున్నారు.