Begin typing your search above and press return to search.
పాక్ పై.. పెద్దన్న నిజ స్వరూపం తెలిసిందే
By: Tupaki Desk | 14 Oct 2017 1:08 PM GMT``పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఎట్టిపరిస్థితిలోనూ ఊరుకునేది లేదు. మేం చేస్తున్న లక్షల డాలర్ల సాయం నిలిపేస్తాం. ఆ దేశాన్ని ఏకాకిని చేస్తాం. మా సహకారం ఆపివేస్తాం``- ఖచ్చితంగా నెల రోజుల కిందట అగ్రరాజ్యం పెద్దన్న అమెరికా మన దాయాది దేశం పాకిస్థాన్‌ను ఉద్దేశించి అదిపెద్ద ప్రపంచ దేశాల వేదిక సాక్షిగా చేసిన హెచ్చరికలు. దీంతో నిజమేనేమో అని అందరూ అనుకున్నారు. ఇక, పాకిస్థాన్ కు చుక్కలు కనిపించడం ఖాయమని కూడా అందరూ చెప్పుకొచ్చారు. మనోళ్లయితే.. మురిసిపోయారు. ఇంకేముంది పాక్ భాగోతం అమెరికానే బట్టబయలు చేసిందని చంకలు గుద్దకున్నాం. కానీ.. ఇప్పుడు అమెరికా యూటర్న్ తీసుకుంది.
తాజాగా పాకిస్థాన్‌ను బండ బూతులు తిట్టిన నోటితోనే పొగడ్తల వర్షం కురిపించింది. ఉగ్రవాదుల చేతుల్లో బందీలుగా ఉన్న తమవారిని బయటపడేసేందుకు పాకిస్థాన్ ఎంతో సాయం చేసిందంటూ అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అన్నారు. కెనడియన్-అమెరికా కుటుంబానికి చెందిన జోషువా బోలే అతడి భార్య ముగ్గురు సంతానం ఇటీవలె హక్కాని నెట్‌వర్క్ ఉగ్రవాదుల చేతుల్లో నుంచి బయటపడ్డారు. ఐదేళ్ల కిందట ఆ కుటుంబం కిడ్నాప్ అయింది. అయితే, తాజాగా వారిని పాకిస్థాన్ బలగాలు విడిపించాయి.
దీంతో తమ దేశీయులకు ఎలాంటి హానీ జరగకుండా విడిపించినందుకు పెన్స్ పాక్ ను కొనియాడారు. వాస్తవానికి గతంలోనే వారిని విడిచిపెట్టే అవకాశం ఉన్నప్పటికీ పాక్ నిర్లక్ష్యం చేసింది. అయితే, ఇటీవలే పాక్ ఉగ్రవాద దేశం అని, ఆదేశానికి ఇదే చివరి హెచ్చరిక అంటూ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో పాకిస్థాన్ కావాలనే రియాక్ట్ అయి అమెరికాను ఆకట్టుకునేందుకే వారి పౌరులను విడిపించింది. ఈ విషయాన్ని గమనించకుండా, పాకిస్థాన్ మొసలి కన్నీరుకు అమెరికా ఫిదా అయిపోయింది. ఇప్పుడు ఈ విషయంపైనా భారత్ నేతలు తల బాదుకుంటున్నారు. పాక్ మోసం కనిపెట్టండి గురూ అంటూ అగ్రరాజ్యానికి ఫోన్లు కొడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.