Begin typing your search above and press return to search.
ప్రపంచానికి షాకివ్వబోయిన..అమెరికన్లను అవాక్కు చేసిన ట్రంప్
By: Tupaki Desk | 2 March 2018 10:39 AM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో మరో వివాదాస్పదమైన నిర్ణయం తీసుకున్నారు. తమ వస్తువులపై వివిధ దేశాలు భారీగా పన్ను వేస్తున్నా...అమెరికా మాత్రం వాటి వస్తువులపై ఎలాంటి పన్ను వేయడం లేదని కొన్నాళ్లుగా ఆయన చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఇండియాపైనా ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు సడెన్ గా స్టీల్ పై 25 శాతం - అల్యూమినియంపై 10 శాతం ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తున్నట్లు ప్రకటించి ప్రపంచ దేశాలను షాక్‌కు గురి చేశారు. ఇంత కీలకమైన విషయాన్ని కూడా ట్రంప్ ట్విట్టర్ ద్వారా ప్రకటించడం గమనార్హం.
అమెరికాలోని కొన్ని వర్గాలే ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది అమెరికా పౌరుల ఉద్యోగాలకు ఏమాత్రం రక్షణ కల్పించకపోగా.. ధరలు పెరిగి వారిపై మరింత భారం పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మరోవైపు దీనిపై ఇప్పటికే కెనడా - యురోపియన్ యూనియన్ - బ్రెజిల్ - చైనా - మెక్సికో తీవ్రంగా స్పందించాయి. తాము కూడా దీనిని తిప్పికొట్టే చర్యలు తీసుకుంటామని ఆ దేశాలు స్పష్టంచేశాయి. అమెరికాకు అతి పెద్ద స్టీల్ ఎగుమతిదారు అయిన కెనడా దీనిపై స్పందిస్తూ.. దీనిని అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. అటు యురోపియన్ యూనియన్ తరఫున యురోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్ క్లాడ్ స్పందిస్తూ.. ఇది యురోపియన్ దేశాల్లోని వేలాది ఉద్యోగాలను ప్రమాదంలో పడేసే చర్య అని అన్నారు. ఇలాంటి చర్యలను చూస్తూ కూర్చోబోమని, తమ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు. చైనా అధికారికంగా స్పందించకపోయినా.. అమెరికా నిర్ణయాన్ని తిప్పికొట్టే పనిలో ఉన్నట్లు తెలిసింది. అటు బ్రెజిల్, ఆస్ట్రేలియా, జర్మనీ కూడా ఇలాంటి చర్యలకే సిద్ధమవుతున్నాయి.
మరోవైపు, స్టీల్ పై దిగుమతి సుంకం వసూల్ చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో మనకు ఎటువంటి నష్టం లేదని భారత్ స్పష్టం చేసింది. భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న ఉక్కు కేవలం రెండు శాతం మాత్రమే ఉన్నదని, ట్రంప్ నిర్ణయం వల్ల మనకు అకస్మాత్తుగా వచ్చే నష్టం ఏమీ ఉండదని ఉక్కు శాఖ ఉన్నతాధికారి తెలిపారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల చైనా - యూరోప్ - కెనడా దేశాలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశాయి. మన దేశం కేవలం రెండు శాతం మాత్రమే ఉక్కును అమెరికాకు ఎక్స్ పోర్ట్ చేస్తోందని - సెక్షన్ 232 ప్రకారం పన్ను విధానాన్ని మినహాయించే వీలుందని భారత ఉక్కు శాఖ కార్యదర్శి అరుణా శర్మ తెలిపారు. 1962లో కుదిరిన వాణిజ్య ఒప్పంద చట్టం ప్రకారం దిగుమతులపై విచారణ చేపట్టే అవకాశాలున్నాయన్నారు.