Begin typing your search above and press return to search.

గోడ క‌ట్టే ప‌నులు మొద‌లెట్టిన ట్రంప్‌

By:  Tupaki Desk   |   25 Jan 2017 11:23 AM GMT
గోడ క‌ట్టే ప‌నులు మొద‌లెట్టిన ట్రంప్‌
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న ఎన్నిక‌ల వాగ్దానంలో మరొక అంశాన్ని ప్ర‌క‌టించేందుకు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. దేశ ర‌క్ష‌ణ‌కు సంబంధించి త‌న ఎన్నిక‌ల ప్ర‌ధాన వాగ్దాన‌మైన మెక్సికో స‌రిహ‌ద్దులో గోడ‌తోపాటు ముస్లిం దేశాల నుంచి వ‌ల‌స‌ల‌కు చెక్ పెట్ట‌డంపై కూడా ట్రంప్ దృష్టి సారించ‌నున్నార, ఒక‌ట్రెండు రోజుల్లో ప్ర‌క‌ట‌న చేయ‌నున్నార‌ని వార్త‌లు వెలువ‌డుతున్నాయి. అమెరికా కాల‌మానం ప్ర‌కారం బుధ‌వారం ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంద‌ని చెప్తున్నారు. అందుకే అమెరికా ర‌క్ష‌ణ‌లో ఇది కీల‌క‌మైన రోజు కానుంద‌ని ట్రంప్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించార‌ని గుర్తుచేస్తున్నారు.

రానున్న రోజుల్లో ఇమ్మిగ్రేష‌న్ - స‌రిహ‌ద్దు భ‌ద్ర‌త‌కు సంబంధించి ట్రంప్ కీల‌క‌మైన ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్స్‌ పై సంత‌కాలు చేయ‌నున్నారు. మిడిల్ ఈస్ట్‌ - ఆఫ్రికాల్లోని ఏడు ముస్లిం దేశాల నుంచి వ‌ల‌స‌ల‌ను పూర్తిగా నియంత్రించే దిశ‌గా ట్రంప్ ఆలోచ‌న చేస్తున్నారు. దీనివ‌ల్ల శ‌ర‌ణార్థుల తాకిడి త‌గ్గ‌నుంది.

దేశ ర‌క్ష‌ణ‌కు సంబంధించి బుధ‌వారం కీల‌క‌మైన రోజు కానుంది. ఎన్నో ముఖ్య‌మైన అంశాల్లో మెక్సికో గోడ కూడా ఒకటి అని ట్రంప్ మంగ‌ళ‌వారం ట్వీట్ చేశారు. త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మెక్సికో నుంచి అక్ర‌మ వ‌ల‌స‌ల‌ను అడ్డుకునేందుకు 3200 కిలోమీట‌ర్ల మేర గోడ క‌డ‌తాన‌ని ట్రంప్ ప‌దేప‌దే చెప్పారు. ఇక అమెరికాలో అక్ర‌మంగా ఉంటున్న ల‌క్ష‌ల మంది వ‌ల‌స‌దారుల‌ను పంపించేయ‌డం కూడా ట్రంప్ ప్లాన్‌లో ఒక‌భాగంగా ఉంది. సిరియా, యెమెన్‌, ఇరాక్‌లాంటి మిడిల్ ఈస్ట్‌ - ఆఫ్రికాల్లోని ఏడు దేశాల నుంచి వ‌ల‌స‌ల‌ను అడ్డుకోవ‌డంపై ఈ వారాంతంలో ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారని అంటున్నారు .మొత్తంగా త‌న ఎన్నిక‌ల ప్రచారంలో ఏ అంశాల‌నైతే ప్ర‌క‌టించారో అదే అంశాల‌ను ఆచ‌ర‌ణ‌లో చూప‌డం ద్వారా స‌త్తా చాటుకునేందుకు ముంద‌డుగు వేస్తున్నార‌ని చెప్తున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/