Begin typing your search above and press return to search.
ఇంకో మొండి నిర్ణయంతో ట్రంప్ రెడీ
By: Tupaki Desk | 29 March 2017 1:09 PM GMTఅమెరికా కొత్త అధ్యక్షుడుఇగా పగ్గాలు చేపట్టిన ట్రంప్ పరిపాలనలో తన ముద్ర వేసుకునేందుకు ఒకింత వేగంగానే కదులుతున్నారు. అయితే ఈ క్రమంలో తాజా నిర్ణయం అమెరికన్ల సంక్షేమానికేనన్న చర్చ జరుగుతోంది. తాజా మాజీ అధ్యక్షుడైన ఒబామా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వరుసగా రద్దు చేసుకుంటూ పోతున్న డొనాల్డ్ ట్రంప్ రద్దుల పద్దులో తాజాగా మరో పథకం చేరింది. దేశ ప్రజలకు స్వచ్ఛ విద్యుత్ అందించే లక్ష్యంతో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నుండి విడుదలయ్యే హరితగృహ వాయువులపై పరిమితులు విధిస్తూ గత అధ్యక్షుడు ఒబామా జారీ చేసిన ఆదేశాలను రద్దు చేసేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై ట్రంప్ సంతకం చేశారని పర్యావరణ పరిరక్షణా సంస్థ కొత్త అధ్యక్షుడు స్కాట్ ప్రుట్ వెల్లడించారు.
2015లో ఒబామా అమలులోకి తెచ్చిన ఈ క్లీన్‌పవర్ ప్లాన్‌ను రద్దు చేయటం ద్వారా బొగ్గు రంగంలో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని పర్యావరణ పరిరక్షణా సంస్థ కొత్త అధ్యక్షుడు స్కాట్ ప్రుట్ చెప్పారు. గత ప్రభుత్వం శిలాజ ఇంథన వినియోగానికి వ్యతిరేకంగా వ్యూహాన్ని అమలు చేసిందని ఆయన గుర్తు చేశారు. అంతేకాక ప్రజలకు దేశీయంగా ఉద్యోగావకాశాలు పెంచుతానంటూ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ అవుతున్నాయని ఆయన వివరించారు. విద్యుత్ వినియోగానికి బొగ్గు స్థానంలో సహజవాయువును ఉపయోగిస్తూ ఒబామాకు ముందు అధ్యక్షునిగా వ్యవహరించిన జార్జ్‌బుష్ దశాబ్ద కాలం క్రితం అమలులోకి తెచ్చిన విధానంతో బొగ్గు రంగంలో ఎక్కువ ఉద్యోగాలు కోల్పోయామన్నారు. ట్రంప్ తన ఎన్నికల హామీలను నెరవేర్చలేరన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. ట్రంప్ తాజా ఆదేశాలతో దేశవ్యాప్తంగా తయారీ రంగం, బొగ్గు రంగంలో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ప్రుట్ చెప్పారు.
స్వచ్ఛ విద్యుత్ పేరుతో గత ఒబామా ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉద్యోగావకాశాలను రద్దు చేసిందని ఆయన విమర్శించారు. 'మీరు అభివృద్ధి, ఉద్యోగాలు కోరుకుంటే మీరు పర్యావరణ వ్యతిరేకులే' అన్న సంకుచిత వాదనను గత కొన్నేళ్లుగా వింటున్నామని వ్యాఖ్యానించారు. ట్రంప్ తాజా ఆదేశాలతో దేశంలో విద్యుత్ రేట్లు తగ్గే అవకాశం ఉందన్నారు. ఒబామా సర్కారు జారీ చేసిన క్లీన్ పవర్ ఆదేశాలను రిపబ్లికన్ పాలిత రాష్ట్రాలతో పాటు దాదాపు 100కు పైగా కంపెనీలు సవాలు చేయటంతో ఫెడరల్ అప్పీల్స్ కోర్టు గత ఏడాది స్టే విధించిన నేపథ్యంలో ట్రంప్ తాజా ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/