Begin typing your search above and press return to search.
ట్రంప్ టవర్ ను డంప్ టవర్ చేసిన గూగుల్
By: Tupaki Desk | 28 Nov 2016 7:30 PM GMTత్వరలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ కు ఆదిలోనే ఘోర పరాభవాలు ఎదురవుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ట్రంప్ కు చెందిన న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్ గూగుల్ మ్యాప్స్‌లో డంప్ టవర్ గా మారిపోయింది. ఫిఫ్త్ అవెన్యూలోని ఈ టవర్ పేరు మారినట్లు గూగుల్ మ్యాప్స్ యూజర్లు గుర్తించారు. అయితే అది మార్చింది ఎవరో తెలియదు. గుర్తు తెలియని ట్రంప్ టవర్ పేరు మార్చారని డబ్ల్యూపీఏఎక్స్ టీవీ రిపోర్ట్ చేసింది.
ట్రంప్ టవర్ పేరు డంప్ టవర్ గా గూగుల్ మ్యాప్స్‌లో మారిన విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై ట్రంప్ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం అధ్యక్ష పదవి మార్పు ప్రక్రియను ట్రంప్ ఈ భవనం నుంచే నిర్వర్తిస్తున్నారు. ఈ ఘటనపై గూగుల్ అధికార ప్రతినిధి స్పందించారు. కంపెనీ ఆ పేరును తిరిగి ట్రంప్ టవర్ అని మార్చినట్లు వెల్లడించారు. మ్యాప్ కచ్చితంగా ఉండేందుకు వినియోగదారులు కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశం కల్పించామని, కానీ అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయని ఆ ప్రతినిధి తెలిపారు.
ఇదిలాఉండగా... అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు పెద్ద ఎత్తున క్రేజ్ పెరిగిపోతోందని ఇటీవల వార్తలు వెలువడ్డాయి. అధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత ట్రంప్ నివాసం, వ్యాపార సముదాయమైన ట్రంప్ టవర్ కు సందర్శకుల తాకిడి రోజు రోజుకు పెరిగిపోతుందని అమెరికా మీడియా రిపోర్ట్ చేసింది. స్వదేశీ - విదేశీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ టవర్ చూసేందుకు క్యూ కడుతున్నారు. దీంతో అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డులకు ఇక చాలు వెళ్లండి అని విసుక్కుంటున్నారు. అయితే సందర్శకులు పెద్ద ఎత్తున రావడంతో ప్రస్తుత సిబ్బంది అదనంగా తాజాగా పోలీసులు కూడా అక్కడికి పెద్ద మొత్తంలో చేరారంట. వీరందరూ భద్రత నిమిత్తం ఆంక్షలు పెడుతున్నప్పటికీ సందర్శకులు మాత్రం సెల్ఫీలు మాత్రం ఆపడం లేదంట. ఎన్నికల నిర్వహణ తేది ప్రకటించినప్పటి నుంచి ఈ తంతు మొదలైందని, ఇప్పుడు ట్రంప్ విజయం సాధించడంతో అది కాస్త మరింత ఎక్కువైందని వారు విశ్లేషిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/