Begin typing your search above and press return to search.
మాల్స్ లో అల్లర్లు...ట్రంప్ టవర్ లో బాంబు
By: Tupaki Desk | 28 Dec 2016 1:40 PM GMTఅగ్రరాజ్యం అమెరికాలో ఒకేరోజు అనూహ్య వార్తలు తెరమీదకు వచ్చాయి. అమెరికా కాబోయే అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చెందిన ట్రంప్ టవర్స్ లో బాంబు ఉందన్న వార్తలు కలకలం సృష్టించాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్.. తాత్కాలికంగా టవర్స్ ను ఖాళీ చేయించారు. అక్కడ అనుమానాస్పదంగా ఓ బ్యాంగ్ ఉండటంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే చివరకు ఈ బ్యాగును తనిఖీ చేసిన బాంబ్ స్క్వాడ్.. అందులో పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉన్నట్లు తేల్చారు. బాంబు వార్తలు రావడంతో టవర్స్ లోని ప్రజలంతా బయటకు పరుగెత్తే వీడియోను ఆన్ లైన్ లో పోస్ట్ చేశారు.
ఇదిలాఉండగా చిత్రమైన కారణానికి అమెరికాలోని పలు షాపింగ్ మాల్స్ వద్ద అల్లర్లు చోటుచేసుకున్నాయి. క్రిస్మస్ తర్వాత షాపింగ్ మాల్స్ కు భారీ ఎత్తున జనం ఎగబడ్డారు. దేశవ్యాప్తంగా సుమారు డజనుకు పైగా మాల్స్ లో గందరగోళం నెలకొంది. కొన్ని మాల్స్ దగ్గర యువత కొట్టుకోగా...కొందరు దొమ్మీలకు పాల్పడ్డారు. అయితే మాల్స్‌లో చోటుచేసుకున్న అల్లర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో కొన్ని మాల్స్ దగ్గర స్వల్పంగా, మరికొన్నింటి దగ్గర భారీగా కస్టమర్లను తరలించాల్సి వచ్చింది. కొలరాడో నుంచి టెన్నిస్సీ - టెక్సాస్ నుంచి న్యూజెర్సీ వరకు ఉన్న మాల్స్‌లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మాల్స్ దగ్గర చెలరేగిన ఉద్రిక్త పరిస్థితులపై సోషల్ మీడియా పాత్ర ఉందన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కొలరాడా రాష్ట్రంలోని అరోరా పట్టణ షాపింగ్ మాల్స్ లో జరిగిన అల్లర్లతోనే సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. టెన్నిస్సీలోని మెమ్‌ప్స్ లో ఏడుగుర్ని అరెస్టు చేశారు. ఇంకా అనేక చోట్ల అల్లర్లు జరిగాయి. క్రిస్మస్ తర్వాత డిస్కౌంట్ సేల్స్ ప్రకటించడం వల్లే జనం భారీగా షాపింగ్ మాల్స్ కు ఎగబడ్డట్లు తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/