Begin typing your search above and press return to search.

ట్రంప్ ట్వీట్ల‌ ఎగ్జిబిష‌న్‌ కు పిచ్చి క్రేజ్‌

By:  Tupaki Desk   |   21 Jun 2017 4:21 AM GMT
ట్రంప్ ట్వీట్ల‌ ఎగ్జిబిష‌న్‌ కు పిచ్చి క్రేజ్‌
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోమారు వార్త‌ల్లో నిలిచారు. సోషల్‌ మీడియాను వాడటంలోనూ ఆయన తర్వాతే ఇంకెవరైనా అనే పేరు సంపాదించిన ట్రంప్ ట్వీట్ల‌కు తాజాగా ఊహించ‌ని గౌర‌వం ద‌క్కింది. ఆయ‌న ట్వీట్ల‌ను ఎగ్జిబిష‌న్‌ గా పెట్టారు. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా చేసిన కామెంట్లు ట్రంప్‌ కు కలిసొచ్చాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కూడా ట్విట్టర్ వినియోగాన్ని మరింత పెంచారు. ఫెడరల్‌ సర్కారులో కీలక పదవుల్లో ఉన్నవారిని తొలగించే విషయాన్ని, కొత్త వారిని నియమించే సమాచారాన్ని కూడా ట్విట్టర్‌ ద్వారానే ప్రకటించారు.

కోపమొచ్చినా - సంతోషమొచ్చినా ట్వీట్లు కొట్టి ``కింగ్‌ ఆఫ్‌ ట్వీట్స్‌`` గా ట్రంప్‌ బిరుదు సంపాదించుకున్నారు. అలా ట్రంప్ ట్వీట్లు ఇప్పుడు మ్యూజియంలో చోటు సంపాదించుకున్నారు. ట్రంప్‌ ట్వీట్లన్నింటినీ ఒక చోట చూసే అవకాశం న్యూయార్క్‌ వాసులకు దక్కింది. న్యూయార్క్‌ లో టెలివిజన్‌ కామెడియన్‌ ట్రెవర్‌ నోవాద `డొనాల్డ్‌ జె ట్రంప్‌ ప్రెసిడెన్షియల్‌ ట్విట్టర్‌ లైబ్రరీ`` పేరుతో ప్రదర్శన ప్రారంభించారు. ఈయన గతంలో ట్రంప్‌ తో కలిసి టి.వి కామెడీ షో లో పనిచేశారు. న్యూయార్క్ లోని ట్రంప్‌ టవర్స్‌ పక్కనే ఈ ప్రదర్శన ఏర్పాటు చేయటం విశేషం.

ఈ ఎగ్జిబిషన్‌ భవనంలోకి అడుగుపెట్టగానే ముందుగా గాజు తలుపులు, మెటల్‌ డిటెక్టర్లున్న సెక్యూరిటీ గార్డులు. తర్వాత ఓ గాజు కేసింగ్‌లో రెండు చేతులు పట్టుకున్న ఐఫోన్‌ దర్శనమిస్తుంది. ఈ చేతుల వెనుక ఉన్న భారీ తెరపై ట్రంప్‌ ట్వీట్ల ప్రదర్శన గురించి ట్రెవర్‌ వీడియో ప్రదర్శన ఉంటుంది. ఎగ్జిబిషన్‌ గోడలపై గతంలో ట్రంప్‌ చేసిన ముఖ్య ట్వీట్లను ఫ్రేముల్లో డిజైన్‌ చేసి పెట్టారు. అమెరికా బడా నేతలపై ఎన్నిసార్లు ట్రంప్ విరుచుకుపడ్డారో ఈ ఎగ్జిబిషన్‌ లో వివరంగా రాసి పెట్టారు. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాపై 2 వేల 723, హిల్లరీ క్లింటన్‌పై 884 సార్లు ట్రంప్ ట్వీట్‌ చేశారు. ఇక ఈ ప్రదర్శనకు జనం భారీ ఎత్తున హాజరవుతుండటం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/