Begin typing your search above and press return to search.

గెలుపుకోసం మోడీ ఇమేజ్ వాడుకుంటున్న ట్రంప్!

By:  Tupaki Desk   |   25 Aug 2020 2:30 AM GMT
గెలుపుకోసం మోడీ ఇమేజ్ వాడుకుంటున్న ట్రంప్!
X
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ .. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ ఎన్నికలు ట్రంప్ కి ఓ అగ్ని పరీక్షలాంటివి. గెలవడం చాలా కీలకం. దీనితో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కొత్త కొత్త ఎత్తుగడలతో అడుగులు ముందుకువేస్తున్నారు.గత ఎన్నికల్లో స్థానికత అంశాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లిన ట్రంప్‌ ఈసారి మాత్రం మన దేశ ప్రధాని నరేంద్రమోదీ ఇమేజ్‌ నే నమ్ముకున్నారు.. ప్రవాసభారతీయుల మనసులు గెల్చుకుని.. తద్వారా ఎన్నికల్లో గెలవాలన్నది ట్రంప్ ప్రస్తుత ముఖ్య‌ ఉద్దేశం. అందుకే ఎన్నికల ప్రకటనలలో నమస్తే ట్రంప్‌, హౌడీ మోదీలలో వీడియోలను వాడుకున్నారు. అయితే మరోసారి విజయం సాధించడం అంత వీజీ కాదనే విషయం ట్రంప్‌ కు కూడా తెలుసు. ప్రస్తుతం ఉన్న సర్వేల ప్రకారం చూస్తే ట్రంప్ మళ్లీ అధికారం చేపట్టడం అసాధ్యం.

పోటీ గట్టిగానే ఉంది.. పైగా ప్రత్యర్థి పార్టీ నుంచి ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్‌ బరిలో దిగడంతో ట్రంప్‌ కు ప్రవాసభారతీయుల మద్దతు కోసం నానా అవస్థలు పడుతున్నారు. అప్పట్లో అమెరికా పర్యటనకు మోదీ వెళ్లారు. అప్పుడు ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రంప్‌ కూడా పాల్గొన్నారు. అలాగే , ఈ ఏడాది మోదీ ఇండియాకు వచ్చినప్పుడు అహ్మదాబాద్‌ లో ఓ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. అందులో మోదీ పాల్గొన్నారు.. పాల్గొనడమే కాదు ట్రంప్ ‌ను మెచ్చుకుంటూ నాలుగైదు మాటలు కూడా మాట్లాడారు. అలా ట్రంప్ ‌ను మెచ్చుకున్న మాటలతో ట్రంప్‌ ఎన్నికల ప్రచార బృందం చక్కటి వీడియోను తయారుచేసింది. ఇది చూస్తే ప్రవాస భారతీయులు కచ్చితంగా ట్రంప్‌ కే ఓటేస్తారన్నది వారి బలమైన నమ్మకం.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్‌ కుటుంబసమేతంగా భారత పర్యటనకు వచ్చారు. అహ్మదాబాద్‌లో ట్రంప్‌కు చాలా గ్రాండ్‌ వెల్కమ్‌ లభించింది. భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఒకే వేదికను పంచుకున్నారు. ఆ సభలోనే ట్రంప్‌ ను ఉద్దేశిస్తూ నాలుగైదు మెచ్చుకోలు మాటలు మాట్లాడారు మోదీ. ఇది ఇప్పుడు ట్రంప్‌ కు బాగా అవసరమవుతున్నది. అమెరికా లవ్స్‌ ఇండియా, అమెరికా రెస్పెక్ట్‌ ఇండియా అంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను వీడియోలో యాడ్‌ చేసి బ్రహ్మండమైన ఎన్నికల యాడ్‌ ను తయారు చేశారు. మొత్తంగా ప్రవాస భారతీయుల ఓట్ల కోసం తెగ కష్టపడుతున్నా కూడా అది ఏ మేర సక్సెస్ అవుతుంది అన్నది తెలియాలి అంటే ..ఎన్నికలు జరిగి , ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే.