Begin typing your search above and press return to search.
ట్రంప్ పై కోపాన్ని ఇలా తీర్చుకున్నారు!
By: Tupaki Desk | 21 March 2021 2:30 AM GMTఅమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగిపోయి ఇన్ని రోజులైనా ఆయనపై కోపం మాత్రం అక్కడి ప్రజలకు తగ్గడం లేదు. అయితే కొందరు ట్రంప్ ను ఎంత అభిమానిస్తారో..? అంతకుమించిన ద్వేషంతో చూసే వారు ఇప్పటికీ ఉన్నారు.
అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్ తన టెంపరితనంతో ఎంతమంది అభిమానులను సంపాదించుకున్నాడో.. అంతే మంది విరోధులను కూడా కూడగట్టుకున్నాడు. ఇప్పటికీ ట్రంప్ పై కోపం ప్రజలకు తగ్గలేదని తేలింది.
టెక్సాస్ లోని శాన్ అంటినియోలో ఉన్న టుస్సాడ్స్ వ్యాక్స్ వర్క్స్ లోని ట్రంప్ మైనపు విగ్రహంపై తాజాగా అక్కడి ప్రజలు కొందరు పంచ్ ల వర్షం కురిపించారు. ప్రధానంగా ఆయన మొహంపై పిడిగుద్దులు గుద్దారు. దాంతో చేసేదేం లేక ట్రంప్ మైనపు విగ్రహాన్ని నిర్వాహకులు అతి కష్టం మీద వేరే చోటుకు తరలించారు.
ఇక పచ్చడి అయిన ట్రంప్ ముఖాన్ని రిపేర్ చేసే పనిలో టుస్సాడ్ నిర్వాహకులు పడ్డారు. గతంలో మాజీ అధ్యక్షులు ఒబామా, జార్ట్ బుష్ విగ్రహాలపై కూడా ఇలాంటి దాడులే జరిగాయని వారు తెలిపారు.